దర్శన్ హత్య కేసులో కీలక సాక్షం, హీరో ఇంట్లో అంత డబ్బులు ఎందుకుంది ?, నిమిషాల్లో !
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప అలియాస్ దర్శన్ పీకలలోతుల్లో చిక్కుకుంటున్నాడని తెలిసింది. హీరో దర్శన్ తో పాటు అతని అనుచరులు ఇంకా కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారనే వాస్తవం పోలీసుల విచారణలో వెల్లడైందని కన్నడ మీడియా అంటోంది.
ఓ వైపు హత్య కేసులో సాక్ష్యం చెప్పకుండా అడ్డుకునేందుకు బెంగళూరులోని పట్టెగెరే షెడ్డు వాచ్ మెన్ కు దర్శన్ గ్యాంగ్ భారీ మొత్తంలో డబ్బు ఎర వేశారని తెలిసింది. మరోవైపు నటుడు దర్శన్ ఇంట్లో రూ. 40 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసును విచారిస్తున్న పోలీసులు గురువారం కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో అనేక విషయాలు ఉన్నాయని తెలిసింది.

రేణుకాస్వామి'హత్య ఘటన తర్వాత బెంగళూరులోని పట్టగెరె షెడ్డు కాపలాదారులకు దర్శన్ గ్యాంగ్ తరపున కొందరు సాక్ష్యం చెప్పకుండా డబ్బులు ఇప్పించారని తెలిపారు. అయితే ఎవరి నుంచి ఆ డబ్బులు షెడ్డు వాచ్ మెన్ కు ఇచ్చారు అనే విషయాన్ని పోలీసులు నిర్ధారించలేదు. షెడ్ వాచ్ మెన్ కు ఎంత మొత్తంలో ఎవరు డబ్బులు ఇచ్చారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి దర్శన్ ఇంట్లో రూ 40 లక్షలు తెచ్చిపెట్టుకున్నాడని పోలీసులు అంటున్నారు. పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగు చూసింది. హత్య కేసుకు సంబంధించి దర్శన్‌ను రెండోసారి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా 40 లక్షలు. డబ్బు విషయంలో నోరు మెదపలేదని తెలిసింది. అనంతరం బెంగళూరులోని ఆర్ ఆర్ నగర్ ఐడియల్ హోమ్ లేఅవుట్ లోని దర్శన్ ఇంట్లో గులాబీ రంగు బ్యాగ్ లో రూ. 37.40 లక్షలు లభ్యమయ్యాయి.
డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బును ఆర్‌ఆర్ నగర్‌లోని దర్శన్ ఇంట్లో అతని భార్య విజయలక్ష్మి వద్ద స్వాధీనం చేసుకున్నారు.గతంలో ఈ కేసులో పేర్లు చెప్పకుండా లొంగిపోయే నలుగురికి 30 లక్షలు ఇవ్వాలని బంధువు ప్రదుష్‌కు దర్శన్ డబ్బులు ఇచ్చాడని తెలిసింది. ఈ హత్య కేసులో దర్శన్‌కు చెందిన మొత్తం రూ. 70 లక్షలు పోలీసులు జప్తు చేశారు. నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హత్య నుంచి తప్పించుకునేందుకు దర్శన్ చేసిన ప్రయత్నానికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడమే కీలక నిదర్శనమని అధికారులు తెలిపారు.దర్శన్ కు రూ. 40 లక్షలు ఎవరు ఇచ్చారు అని పోలీసులు ఆరా తీశారు. హత్య కేసు నుంచి తప్పించుకునేప్రయత్నాల్లో భాగంగా దర్శన్ తనకు తెలిసిన వారి నుంచి క్షణాలలో రూ. 40 లక్షలు రాబట్టాడు. హత్య జరిగిన రోజున దర్శన్ అతని స్నేహితుడు మోహన్ రాజ్ నుంచి రూ. 40 లక్షలు అందుకున్నట్లు సమాచారం.
దర్శన్ కు రూ. 40 లక్షలు డబ్బులు ఇచ్చిన మోహన్ రాజ్ బీజేపీ నాయకుడని, బెంగుళూరులో ఎక్కువ ప్రభావం చూపే బీజేపీ ఎమ్మెల్యేకు మోహన్ రాజ్ అత్యంత సన్నిహితుడు అని పోలీసులు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే బీజేపీ ఎమ్మెల్యే తరపున హీరో దర్శన్ ఎన్నికల ప్రచారం చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద హత్య కేసులో అరెస్టు అయిన హీరో దర్శన్ ఇప్పుడు పీకలలోతులో చిక్కుకున్నాడని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications