ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గాయని పీ.సుశీల...
ప్రముఖ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పీ.సుశీల తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో నిన్న (శనివారం) ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అయితే, అది మామూలు కడుపు నొప్పేనని, చింతించాల్సిన అవసరమేమి లేదని డాక్టర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాల పేర్కొన్నాయి. సుశీల ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
పద్మభూషణ్ గ్రహీత పి. సుశీల.. తెలుగులో ఎన్నో మధురమైన పాటలు ఆలపించారు. ఆమె ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా మొత్తం తొమ్మిది భాషలలో పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకన్నారు. ఇప్పటివరకూ ఆమె నలభై వేలకు పైగా పాటలు పాడారు. అప్పటి సినిమాల్లోని మహనటి సావిత్రి, పద్మిని, సరోజాదేవి వంటి దిగ్గజ నటీమణులకెందరికో పాటలు పాడి తన గాత్రంతో అలరించారు.

'లైక్ పాల్' అనే పాటకు పి. సుశీలకు జాతీయ అవార్డు సొంతం చేసుకున్నరు. ఈ పాట ఉష్రేష్ మన్మాన్ సినిమాలోనిది. వృద్దాప్యంలో వచ్చిన సమస్యల కారణంగా ఆమె గతకొంతకాలంగా తన గాత్రానికి బ్రేక్ ఇచ్చారు. పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆమె తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆమె సన్నిహితులు నెట్టింట తెగ పోస్టులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications