ఆ హీరోయిన్‌కే మాత్రమే బర్త్ విషెష్ చెప్పిన ప్రభాస్
ప్రభాస్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా బహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. నార్త్ జనాలు సైతం ప్రభాస్ యాక్షన్‌కు ఫిదా అయిపోయారు. సాహో సినిమా తెలుగులో కన్నా బాలీవుడ్‌లోనే ఎక్కవ కలెక్షన్స్ సాధించిందంటే అక్కడ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో నిరాశ పర్చిన ప్రభాస్, సలార్, కల్కి వంటి వరుస హిట్లతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా నిరూపించాడు.
ప్రభాస్ ప్రస్తుతం సలార్-2, కల్కి-2 సినిమాల్లో నటిస్తున్నాడు. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదే సమయంలో ప్రభాస్ పెళ్లి గురించి కూడా అనేక వార్తలు వైరల్ అయ్యాయి. ప్రభాస్. హీరోయిన్ అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని.. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక వార్తలు తెర మీదకు వచ్చాయి. ఆ తర్వాత ఆదిపురుష్ సినిమా హీరోయిన్ కృతి సనన్‌తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని గుసగుసలు వినిపించాయి. అలాంటిది ఏమీ లేదని ప్రభాస్ క్లారిటీ ఇచ్చేశారు.

ఇక ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి ఓ లుక్ వేస్తే.. ఆయన చాలా రిజర్వ్డ్‌గా ఉంటారు. బయట పెద్దగా కనిపించరు. తన సినిమా ఫంక్షన్స్‌లో మాట్లాడానికే ఆయన సిగ్గపడుతుంటారు. కేవలం తన స్నేహితులతోనే ప్రభాస్ ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. సోషల్ మీడియాలో చాలా తక్కువగా ఉంటారు ప్రభాస్. అలాంటిది ఆయన ఓ హీరోయిన్‌కు ఏకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారాయన.ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె.

ఆదివారం దీపిక పదుకొణె పుట్టిన రోజు కావడంతో ఆమెకు విషెష్ చెబుతూ.. 'ఎవర్ టాలెంటెడ్ అయిన దీపిక పదుకొణెకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఆనందం, విజయం, అంతులేని హ్యాపినెస్‌తో ఇలానే ఉండాలని కోరుకుంటున్న' అనే క్యాప్షన్ జోత చేశారు. వీరిద్దరు కలిసి కల్కి సినిమాలో నటించారు. కల్కి-2లో కూడా వీరిద్దరు కలిసి నటించబోతున్నరు. ప్రస్తుతం ప్రభాస్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications