బిగ్‌బ్రేకింగ్: శుభవార్త చెప్పబోతున్న ప్రభాస్: శ్యామలాదేవి
పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అని చెప్పొచ్చు. అభిమానులు తమ డార్లింగ్ ఎప్పుడు వివాహం చేసుకుంటాడా? ఎప్పుడు శుభవార్త చెబుతాడా? అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలో కృష్ణంరాజు జీవించి ఉన్న సమయంలో విలేకరులు ప్రభాస్ ను వివాహం గురించి అడగ్గా కృష్ణంరాజు చేసినప్పుడు జరుగుతుంది అంటూ సమాధానం చెప్పేవాడు. గతంలో త్రిషతో రిలేషన్ లో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే తనకు ఇష్టంలేని పనులు చేయడంతో ప్రభాస్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
తర్వాత అనుష్కతో రేపో, మాపో పెళ్లి జరగబోతోందంటూ వార్తలు వచ్చాయి. వారిద్దరి జంట అంత బాగుంటుంది కాబట్టి, సినిమాల్లో వీరిద్దరి కెమిస్ట్రీ కూడా అదిరిపోతుంది కాబట్టి కచ్చితంగా వీరిద్దరూ వివాహం చేసుకుంటారని అందరూ భావించారు. అయితే అటువంటిదేమీ లేదని, తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని ప్రభాస్ ప్రకటించాడు. అలాగే కాజల్ అగర్వాల్ ను కూడా ప్రేమించాడని, కానీ కుదర్లేదంటూ వార్తలు వచ్చాయి. గతేడాది ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి మీడియాతో మాట్లాడుతూ సంబంధాలు చూస్తున్నామని చెప్పింది.

త్వరలోనే శుభవార్త చెబుతాం
తాజాగా ఆమె దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని విజయవాడ అమ్మవారి దర్శనానికి వచ్చింది. దర్శనం అనంతరం బయటకు రాగానే విలేకరులు ప్రభాస్ పెళ్లి గురించి అడిగారు. దీనిపై ఆమె మాట్లాడుతూ త్వరలోనే మీడియా మొత్తాన్ని పిలవనున్నామని, అందరికీ శుభవార్త చెప్పనున్నామని చెప్పింది. అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న క్షణాలు వచ్చేశాయని, త్వరలోనే పూర్తి వివరాలు చెబుతానని చెప్పింది.
అమ్మాయి సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయి కాదని తెలుస్తోంది. ప్రభాస్ సొంత ఊరు మొగల్తూరుకు చెందిన అమ్మాయినే చూశారని, ఆ అమ్మాయి ప్రభాస్ కు దగ్గరి బంధువుల అమ్మాయి అని, వాస్తవానికి వీరిద్దరికీ ఎప్పుడోనే వివాహాన్ని కుదిర్చారని, అయితే సినిమాలపరంగా తనకున్న షెడ్యూల్స్ ను పూర్తిచేసుకొని వివాహం చేసుకోవాలని డార్లింగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజాసాబ్, స్పిరిట్, సలార్-2 చిత్రాలు చేయాల్సి ఉంది. వీటి తర్వాత కల్కి2 ఉంటుంది. మరి ఎప్పుడు వివాహం చేసుకుంటాడో చూడాలి.












Click it and Unblock the Notifications