అయోధ్యలో ప్రభాస్ అన్నదానం... ఎన్ని రూ.కోట్లో తెలుసా?

పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ మనస్తత్వం గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. తన తోటి నటీనటులే కాకుండా అభిమానులతోపాటు ప్రతి ఒక్కరూ ప్రభాస్ అంటే ఇష్టపడతారు. ఎందుకంటే ఆయన భోళా మనిషి. సినిమా షూటింగ్ ఉందంటే తానొక్కరే భోజనం చేయరు. తనతోపాటు తోటి నటీనటులకు, సెట్ లో పనిచేసే బాయ్స్ తో సహా అందరికీ తానే స్వయంగా ఇంటిదగ్గర నుంచి భోజనం తెప్పిస్తారు.

తెలుగింటి విందు భోజనం లేనిదే ప్రభాస్ కు ముద్ద దిగదు. ఇలాంటి సంఘటనలు చూసిన ప్రతి ఒక్కరూ ప్రభాస్ నిజంగా రాజు అని, రాజులాంటి మహారాజు అంటూ కొనియాడతారు. ఈనెల 22వ తేదీన అయోధ్యలో రామమందిరం ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా బాలరాముడికి ప్రాణప్రతిష్ట జరగనుంది. దీనికోసం విదేశాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అతిథులంతా అయోధ్యకు తరలిరానున్నారు.

Prabhas meals donation in ayodhya

రామమందిరం చుట్టుపక్కల కలిపి దాదాపు 300 ప్రాంతాల్లో అన్నదానం చేయనున్నారు. దీనికి ప్రభాస్ ముందుకు వచ్చారు. ఖర్చు రూ.50 కోట్లు కానున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మోహన్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఈ సందర్భంగా జరిగే అన్నదానం బాధ్యతను డార్లింగ్ ప్రభాస్ స్వీకరించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారు. అతని మంచి మనసుకు, మంచి మనస్తత్వానికి ఇది నిదర్శనమంటూ పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో ఈనెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అత్యంత వైభవోపేతంగా జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+