ప్రకాష్ రాజ్ తల్లి అంత్యక్రియలపై రచ్చ: నెటిజన్లకు షాకింగ్ ఆన్సర్!

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన తల్లి అంత్యక్రియల విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై అత్యంత ఘాటుగా స్పందించారు. "నేను దేవుడిని నమ్మను.. కానీ మా అమ్మ నమ్మేది" అంటూ విమర్శకులకు ప్రకాష్ రాజ్ రెండు ముక్కల్లో సమాధానం ఇచ్చారు. 86 ఏళ్ల వయస్సులో ప్రకాష్ రాజ్ మాతృమూర్తి సువర్ణలత రాజ్ అనారోగ్య సమస్యలతో మంగళవారం(మార్చి 31) రోజులో బెంగళూరులో కన్నుమూశారు.

అసలేం జరిగిందంటే?
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తల్లి అంత్యక్రియలను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను నాస్తికుడిని అని, తనకు దేవుడిపై నమ్మకం లేదని ప్రకాశ్ రాజ్ కామెంట్ చేశారు. ఇప్పడు తల్లి అంత్యక్రియలను చర్చిలో మతపరమైన పద్ధతుల్లో నిర్వహించడాన్ని కొందరు తప్పుబడుతూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. నాస్తికుడనని చెప్పుకునే వ్యక్తికి ఇవన్నీ ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఈ విమర్శలపై ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించిన ప్రకాష్ రాజ్.. "అవును, నాకు దేవుడిపై నమ్మకం లేదు. కానీ నా తల్లికి తన దేవుడిపై అపారమైన నమ్మకం ఉండేది. ఆమె నమ్మకం ప్రకారం అంత్యక్రియలు పొందే హక్కును కాలరాయడానికి నేనెవరిని? ఒకరినొకరు గౌరవించుకోవడంలో ఇది కనీస మర్యాద. ఈ విషయం ద్వేషాన్ని వ్యాప్తి చేసే రాక్షకులకు అర్థమవుతుందా?" అంటూ ప్రకాష్ రాజ్ నిలదీశారు.

Prakash Raj Slams Trolls Over Funeral Controversy Says I Don t Believe in God But My Mother Did

సెయింట్ మైకేల్ చర్చిలో అంత్యక్రియలు
ప్రకాష్ రాజ్ మాతృమూర్తి సువర్ణలత రాజ్ అంత్యక్రియలు మార్చి 31న బెంగళూరులోని సెయింట్ మైకేల్ చర్చిలో జరిగాయి. క్రైస్తవ మత ఆచారాల ప్రకారం 'ఫ్యూనరల్ మాస్' నిర్వహించిన అనంతరం ఆమెను 'సేక్రెడ్ హార్ట్' స్మశానవాటికలో ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ భార్య పోనీ వర్మ, పిల్లలు పూజ, మేఘన, వేదాంత్, సోదరుడు ప్రసాద్ రాజ్, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సన్నిహితులు పాల్గొన్నారు.

తల్లి అనారోగ్యంపై గతంలో ప్రకాష్ రాజ్ కామెంట్స్
తన మాతృమూర్తి ఆరోగ్యం గురించి ప్రకాష్ రాజ్ గతంలో ఓ సదస్సులో వెల్లడించారు. ఆమె మెదడులో ఓ కంతి ఏర్పడిందని.. సర్జరీ తర్వాత ఆమె జ్ఞాపకశక్తిని కోల్పోయారని తెలిపారు. "ఆపరేషన్ జరిగిన మూడు రోజులకే ఆమె తన కొడుకును, సోదరిని కూడా మర్చిపోయారు. ఆ పరిస్థితి నన్ను ఎంతో కలిచివేసింది" అని ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

వరుస సినిమాలతో బిజీ
ఐదు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న 61 ఏళ్ల ప్రకాష్ రాజ్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తలపతి విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరుగుతున్న 'జన నాయకన్' లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనితో పాటు 'డకాయిత్', 'వారణాసి', 'స్పిరిట్' వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇన్ని కష్టాల మధ్య కూడా తన వ్యక్తిగత విశ్వాసాల కంటే తల్లి కోరికకే ప్రాధాన్యతనిచ్చి ఆయన తన సంస్కారాన్ని చాటుకున్నారని ఫ్యాన్స్ మద్దతు తెలుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+