షారుక్ ఖాన్ 'డంకీ'పై ప్రశాంత్ నీల్ కామెంట్స్

హోంబలే ఫిలింస్ పతాకంపై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా వచ్చిన 'సలార్‌' ఈ ఏడాది బిగ్గెస్ట్‌ హిట్‌ల జాబితాలో చేరింది. ఈ సందర్భంగా జరుగుతున్న కొన్ని ఇంటర్వ్యూల్లో దర్శకుడు పాల్గొంటున్నారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో డంకీ, సలార్ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇద్దరు హీరోల సినిమాల మధ్య పోటీ పెడుతూ కొందరు అభిమానులు గొడవ పడుతుంటారుకానీ తాను మాత్రం ఇలాంటివాటిని ప్రోత్సహించనని స్పష్టం చేశారు. అసలు వినడానికి కూడా ఇష్టపడను అన్నారు. సినిమా రంగానికి ఇటువంటి పోకడలు మంచివి కావన్నారు. నటీనటులు అలా ఒకరితో ఒకరు పోటీ పెట్టుకోరని, అందరూ స్నేహభావంతో ఉంటారన్నారు. 'సలార్‌', 'డంకీ' మధ్య నెగెటివ్‌ వాతావరణం ఉండాలని తానెప్పుడూ కోరుకోలేదని, 'డంకీ' నిర్మాతలు కూడా అలానే ఆలోచించి ఉంటారన్నారు.

prashanth neel comments on dunky movie

వినోదాన్ని పంచాలనే తపన అందరిలో ఉంటుందని, రెండింటి మధ్య పోటీ ఉండడానికి ఇదేం క్రికెట్‌ మ్యాచ్‌ కాదు కదా అని ప్రశాంత్ నీల్ వ్యాఖ్యానించారు. 'సలార్‌' (Salaar) సినిమాకు తగిన ప్రచారం చేయలేదని చేసి ఉంటే ఇంకా ఎక్కువ కలెక్షన్లు వచ్చేయంటూ వార్తలు వస్తున్నాయని, 'డంకీ'తోపాటు కాకుండా సోలోగా విడుదలైతే ఇలాంటి వార్తలు వచ్చేవి కావన్నారు. రెండు సినిమాల మధ్య పోటీ పెట్టి ఒకదాన్ని తక్కువ చేసి చూడొద్దని హితవు పలికారు. డిసెంబర్‌ 22న విడుదలైన 'సలార్‌' భారీ విజయాన్ని దక్కించుకుంది. త్వరలోనే దీని రెండో భాగం 'శౌర్యాంగ ప‌ర్వం' ప్రారంభం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+