స్టార్ హీరో కేసులో నిర్మాతలకు షాక్, విచారణ చెయ్యాలని చెప్పిన హైకోర్టు, హీరోను నీచంగా !
తనపై అనవసర ఆరోపణలు చేశారని శ్యాండిల్ వుడ్ నిర్మాత ఎన్. ఎం. సురేష్ తదితరులపై బహుబాష నటుడు, దర్శకుడు కిచ్చా సుదీప్ వేసిన పరువు నష్టం దావాను కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. ప్రముఖ నిర్మాత ఎన్ఎం. సురేష్, కుమార్‌లు ఇప్పుడు కోర్టు విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. అంతే కాకుండా విచారణలో పరువు నష్టం జరిగినట్లు నిర్ధారణ అయితే అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది.
తనపై ట్రయల్ కోర్టులో కొనసాగుతున్న కేసును రద్దు చేయాలని మనవి చేస్తూ శ్యాండిల్ వుడ్ నిర్మాత సురేష్ కర్ణాటక హైకోర్టులో దరఖాస్తు సమర్పించారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విశ్వజిత్ శెట్టి నేతృత్వంలోని ఏక సభ్య ధర్మాసనం నిర్మాత సురేష్ సమర్పించిన పిటిషన్ ను పరిశీలించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఫిర్యాదులోని వాస్తవాలు, ఆయన ఇచ్చిన సెల్ఫ్ స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తే పిటిషనర్ వాంగ్మూలం కించపరిచేలా ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

సమాజంలో ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని, ఫిర్యాదుదారుడి అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోందని, కాబట్టి ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేయడంలో ఎలాంటి లోపం లేదని కోర్టు తెలిపింది. కర్ణాటక ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ మరియు ఫిల్మ్ కామర్స్ బోర్డ్ సెక్రటరీ అయిన తన క్లయింట్ ఎంఎన్ కుమార్ కు, ఫిర్యాదుదారుకు మధ్య వ్యాజ్యం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

కాబట్టి తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోర్టును కోరారు. అయితే కోర్టు అందుకు అంగీకరించలేదు. గతేడాది విలేకరుల సమావేశంలో నిర్మాత ఎం. ఎన్. కుమార్, ఎన్. ఎం. సురేష్ తదితరులు నటుడు సుదీప్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో సందేశాలు కూడా పోస్టు చేశారు. హీరో సుదీప్ ను కించపరుస్తు ఆ నిర్మాతలు పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో నిర్మాతలపై హీరో సుదీప్ క్రిమినల్ పరువునష్టం కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన బెంగళూరు 13వ ఏసీఎంఎం కోర్టు ఫిర్యాదులో వాస్తవాలు ఉన్నాయని తేల్చింది. నిర్మాతలు ఎం. సురేష్‌తో పాటు ఇతర నిర్మాతలను కోర్టుకు పిలిపించారు. అనంతరం ఇద్దరు నిందితులు ట్రయల్ కోర్టుకు హాజరై బెయిల్ పొందారు. కానీ సమన్లను రద్దు చేయాలని నిర్మాత ఎన్. ఎం. సురేష్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో నిర్మాతలు ఇప్పుడు విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications