తెలుగు హీరోయిన్లపై నిర్మాత ఎస్‌కేఎన్ షాకింగ్ కామెంట్స్.. ఆమేనా టార్గెట్ ?
నిర్మాత ఎస్‌కేఎన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నిర్మించే సినిమాల కంటే కూడా స్టేజీపై చేసే కామెంట్స్ ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగు హీరోయిన్లపై ఎస్‌కేఎన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
లవ్ టుడే సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్ రంగనాథ్. డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా మంచి మార్కులు కొట్టేశారు. తాజాగా 'డ్రాగన్' అనే మూవీతో రాబోతున్నాడు ప్రదీప్. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కాయడు లోహర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశ్వత్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కాగా ఈ ఈవెంట్‌కి డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, బేబీ చిత్ర నిర్మాత ఎస్ కె ఎన్ కూడా అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరోయిన్ కాయడు లోహర్ గురించి ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిల్నే ఎక్కువగా ప్రేమిస్తుంటారు.. తెలుగమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుద్దో మాకు తెలిసి వచ్చింది. అందుకే ఇకపై తెలుగు రాని అమ్మాయిల్నే సపోర్ట్ చేయాలని నేను, సాయి రాజేష్ ఫిక్స్ అయ్యాం అంటూ ఎస్‌కేఎన్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్యని ఉద్దేశించే ఈ మాటలు అన్నట్లు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో బేబీ ప్రమోషన్స్ టైంలో అయితే తెలుగు అమ్మాయిల్నే ఎంకరేజ్ చేస్తాం.. వారికే ఛాన్స్ ఇస్తామని ఎస్‌కేఎన్ మాట్లాడారు. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు యూటర్న్ తీసుకున్నారో అని చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ సైతం తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని అన్నారు. మరి ఈ కామెంట్స్ పై వైష్ణవి ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications