అల్లు అర్జున్‌కు ఘోర అవమానం... ఇంకో హీరో అయితే...?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారు. ముగ్గురు కథానాయికలకు ఈ సినిమాలో చోటుంది. విజువల్ గ్రాఫిక్స్ కు పెద్దపీట వేస్తున్నారు. బన్నీ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారు ఈ సినిమా ద్వారా. బన్నీ అభిమానులకు ఒకరకంగా ఇది శుభవార్తే అని చెప్పొచ్చు. ఇటీవలే పుష్ప2తో భారీ విజయాన్ని నమోదు చేశారు అల్లు అర్జున్. పాన్ ఇండియా సినిమా విడుదలైన పుష్ప2 రూ.1850 కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు చెబుతున్నారు. ఫిలింనగర్ వర్గాలు మాత్రం రూ.1350 కోట్ల వరకు ఉండొచ్చంటున్నారు.

టీవీ యాజమాన్యం షాక్
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు దక్షిణాదికన్నా ఉత్తరాదిలోనే భారీ కలెక్షన్లు వచ్చాయి. తర్వాత ఓటీటీలోకూడా సినిమా ప్రసారమైంది. ఇటీవలే ఓ తెలుగు ఛానల్ శాటిలైట్ హక్కులను దక్కించుకొని భారీస్థాయిలో ప్రచారం చేసుకొని ప్రసారం చేసింది. తీరా చూస్తే ఈ సినిమాకు టీవీలో 12.5 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా టీవీ యాజమాన్యంతోపాటు పుష్ప2 చిత్ర యూనిట్ కూడా షాక్ తింది. చాలా చిన్న చిన్న సినిమాలకు కూడా రూ.15 పైనే టీఆర్పీ రేటింగ్స్ ఈరోజుల్లో వస్తున్నాయి. అటువంటిది స్టార్ హీరోగా ఉన్న బన్నీ చిత్రానికి ఒక ఫ్లాప్ చిత్రానికి వచ్చేంత టీఆర్పీ రేటింగ్ రావడాన్ని అతని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

Pushpa 2 got a trp rating of 12 5 on TV Film analysts say it s an insult to allu arjun and pushpa2 tema

బుల్లితెరపై అట్టర్ ఫ్లాప్
టీవీలో పుష్ప2కు 12.5 టీఆర్పీ రేటింగ్ వచ్చిందంటే ఆ సినిమా బుల్లితెరపై అట్టర్ ఫ్లాప్ అని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. వెండితెరపై ఘనవిజయం సాధించడానికి, బుల్లితెరపై ఘనవిజయం సాధించడానికి తేడాలుంటాయని, థియేటర్లలో మంచి హిట్ అయిన ఈ సినిమాను బుల్లితెరపై చూడటానికి ప్రజలు ఇష్టపడలేదని అర్థమవుతోంది. పుష్ప1 చిత్రం ప్రసారమైనప్పుడు మంచి రేటింగ్ (25.1) వచ్చింది. వాస్తవానికి పుష్ప2 మీద పుష్ప1 బాగుందంటూ చాలామంది అన్నారు. మొదటి భాగం హిట్ అయింది కాబట్టి ఆ క్రేజ్ మీద పుష్ప2 చూశారు. దీనికితోడు విపరీతమైన టికెట్ ధరలు పెట్టడంతో చాలామంది ఓటీటీల్లో చూసేశారు. ఇప్పుడు టీవీలో ఎవరూ చూడకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనికి పలురకాల కారణాలు చెబుతున్నప్పటికీ, బుల్లితెరపై మాత్రం పుష్ప2 ఫ్లాప్ అయిందని చెప్పొచ్చంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+