రూ.వెయ్యి కోట్లు రాబడుతున్న తరుణంలో 'పుష్ప2'పై పెద్ద దెబ్బ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప2 భారీ అంచనాల మధ్య ఈనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్నదానికన్నా ఎక్కువగా కలెక్షన్లను కొల్లగొడుతోంది. తెలుగుతోపాటు దక్షిణాది ప్రేక్షకులకన్నా ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాను భారీగా ఆదరిస్తున్నారు. అందుకు నిదర్శనం ఈ సినిమాకు ఉత్తర భారతంలో వస్తున్న కలెక్షన్లే. తెలుగుకన్నా ఎక్కువ కలెక్షన్లు హిందీ బెల్టులోనే వస్తాయని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో టికెట్ ధరలు అధికంగా ఉండటంతో సోమవారం నుంచి నిర్మాతలు వాటిని తగ్గించారు.
రూ.వెయ్యికోట్ల చేరువలో పుష్ప2
ఆరు రోజులకే రూ.900 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి రూ.వెయ్యి కోట్ల దిశగా దూసుకువెళుతున్న క్రమంలో పుష్ప2పై అనూహ్యంగా దెబ్బ పడింది. ఈ సినిమా థియేటర్ ప్రింట్ యూట్యూబ్ లోకి వచ్చింది. గోట్స్ అనే యూట్యూబ్ ఖాతాలో ఈ సినిమా ప్రింట్ విడుదలైంది. అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్న తరుణంలో ఇలా ప్రింట్ బయటకు రావడంపై చిత్ర యూనిట్ షాక్ కు గురైంది. భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాకు ఇలా దెబ్బ పడటంపై నిర్మాతలు ఇలా చేసిందెవరా? అనే కోణంలో పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

బాహుబలి2, దంగల్ ను దాటాల్సి ఉంది
లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్నివేల రూ.కోట్లు సాధిస్తుందనే విషయమై ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. బాహుబలి2ను దాటుతుందని కొందరు అంటున్నారు. ఇది దాటే క్రమంలో కేజీఎఫ్, కల్కి సినిమా రికార్డులను బద్దలు కొట్టేయనుంది. అది కొట్టిన తర్వాత ఆర్ఆర్ఆర్ రికార్డులను అధిగమించాల్సి ఉంటుంది. వాటి తర్వాతా బాహుబలి2 ఉంది. ఈ సినిమాకు ఇండియాలో దాదాపు రూ.1800 కోట్లు వచ్చాయి. దంగల్ కు ప్రపంచవ్యాప్తంగా రూ.2వేల కోట్లు వచ్చాయి. వీటిని పుష్ప2 అధిగమిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ ఇప్పుడు బన్నీ అభిమానుల్లో నెలకొంది. కచ్చితంగా వాటిని కూడా బద్దలు కొడతామని బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications