అయినా మారని అల్లు అర్జున్... దానికోసం విదేశాలకు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప2 సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సినిమా పెద్ద ప్రభంజనాన్నే సృష్టిస్తోంది ఇప్పటికే రూ.1800 కోట్ల పైచిలుకు కలెక్షన్లు కొల్లగొట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో మాత్రం బ్రేక్ ఈవెన్ అయింది. ఇతర ప్రాంతాల్లో మాత్రం బయ్యర్లకు ఇంకా డబ్బులు రాలేదని తెలుస్తోంది. ఇంత కలెక్షన్లు వచ్చినా కొన్నిచోట్ల బయ్యర్లు నష్టపోవడం ఆశ్చర్యపరుస్తోంది. టికెట్ ధరలు అధికంగా ఉండటంవల్ల తెలుగు ప్రేక్షకులు థియేటర్ల రాలేదని తెలుస్తోంది.
ఒకరోజు టికెట్ ధర రూ.117
బాహుబలి2 రికార్డును బద్దలు కొట్టామని పుష్ప2 యూనిట్ ప్రకటించింది. చివరగా దంగల్ రికార్డును బద్దలు కొట్టాల్సి ఉంది. అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన దంగల్ కు భారతదేశంలోకన్నా చైనాలోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమా రూ.2వేల కోట్లు రాబట్టింది. దీన్ని అందుకోవాలనే ఉద్దేశంతో ఉన్న పుష్ప2 యూనిట్ అదనంగా 20 నిముషాల సన్నివేశాలను కలిపి 17వ తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చింది. అదేరోజు థియేటర్లలో టికెట్ ధర కేవలం రూ.117గా నిర్ణయించారు. దేశంలో ఇలాగేవుంటే దంగల్ కలెక్షన్లు అందుకోలేమనే ఉద్దేశంతో చైనాలో విడుదలకు రంగం సిద్ధం చేశారు.

దంగల్ రికార్డును బద్దలు కొట్టాలని
అక్కడ కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడితే చాలా సులువుగా రూ.2వేల కోట్లు అందుకొని దంగల్ రికార్డను బద్దలు కొట్టాలని భావిస్తున్నారు. అందుకనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. చైనాలో ఇతర దేశాల సినిమాలు వంతువారీగా విడుదలవుతాయి. ప్రస్తుతం అక్కడ విజయ్ సేతుపతి మహారాజా సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంకా ఆడుతూనే ఉంది. దీనితర్వాత పుష్ప2 విడుదల కాబోతోంది. ఎర్రచందనం అంటే చెైనీయులకు ఎంతో పవిత్రమైంది. దాంతో ముడిపడివున్న కథ కావడంతో సినిమా అక్కడ బాగా ఆడుతుందనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మాతలున్నారు. అక్కడ విడుదలైన తర్వాత ఎంత రాబడుతుందో చూడాలి. అల్లు అర్జున్ ఏమాత్రం మారలేదని, ఎంతో పట్టుదలతో ఉన్నాడని, పుష్ప2ను భారతదేశంలోనే నెంబర్ వన్ సినిమా నిలపాలనే లక్ష్యంతోనే చెైనాలో కూడా విడుదల చేయిస్తున్నారని, ఇటువంటి ప్రోత్సాహమిచ్చే హీరోలుంటే భారీ లాభాలు కళ్లచూడటం నిర్మాతలకు పెద్ద కష్టమేం కాదనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications