రాధికా ఆప్టే vs పాయల్ రాజ్‌పుత్.. టాలీవుడ్లో కొత్త వివాదం!
టాలీవుడ్‌పై ప్రముఖ నటి రాధికా ఆప్టే ఇటీవల చేసిన వివాదాస్పద కామెంట్స్ సినీ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే నిర్మాత ఎస్కేఎన్ ఈ కామెంట్లపై ఘాటుగా స్పందించగా.. తాజాగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా ఈ వివాదంలోకి అడుగుపెట్టారు. తెలుగు చిత్రసీమ పట్ల తనకున్న కృతజ్ఞతను, అభిమానాన్ని చాటుకుంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నన్ను నిలబెట్టిన ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణపడి ఉంటా: పాయల్
తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికగా పనిచేయడం తనకెంతో గర్వకారణమని పాయల్ రాజ్‌పుత్ పేర్కొన్నారు. ఓ నటిగా తన కెరీర్ ను తీర్చిదిద్దడంలోనూ నేడు తాను అనుభవిస్తున్న గుర్తింపు, ఆదరణ, అవకాశాలను అందించడంలో టాలీవుడ్‌దే కీలక పాత్ర అని ఆమె కొనియాడారు. తనను ఆదరించి, నిలబెట్టిన పరిశ్రమకు తాను ఎల్లప్పుడూ అండగా నిలబడతానని పాయల్ రాజ్‌పుత్ స్పష్టం చేశారు.

తన కృతజ్ఞతను చాటుకోవడమే కాకుండా ఇండస్ట్రీ నుంచి అన్ని ప్రయోజనాలు పొంది ఇక్కడే కెరీర్‌ను నిర్మించుకుని ఆ తర్వాత అదే ఇండస్ట్రీపై ప్రతికూలంగా మాట్లాడే వ్యక్తుల తీరును పాయల్ రాజ్‌పుత్ ప్రశ్నించారు. ఓ ఇండస్ట్రీ అందించిన మద్దతుతో ఎదిగి ఆ తర్వాత అదే పరిశ్రమకు వెన్నుపోటు పొడిచేలా మాట్లాడే మనస్తత్వాన్ని ఆమె తప్పుబట్టారు. తనకు ఎంతో ఇచ్చిన పరిశ్రమ పట్ల తాను ఎప్పటికీ వ్యతిరేకంగా మాట్లాడనని పాయల్ రాజ్‌పుత్ స్పష్టం చేశారు.
ఏ ఒక్కరి పేరునూ నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ.. పాయల్ రాజ్‌పుత్ చేసిన ఈ కామెంట్స్ రాధికా ఆప్టేను ఉద్దేశించినవేనని సినీ వర్గాల్లో భారీగా చర్చ జరుగుతోంది. నిర్మాత ఎస్కేఎన్, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ వంటి ప్రముఖుల వరుస స్పందనలతో టాలీవుడ్లో రాధికా ఆప్టే కామెంట్ల వివాదం మరింత వేడెక్కింది.
Tollywood made me who I am today. I will always stand by the industry that stood by me. 🎬🔥— Payal Rajput https://t.co/YvO6hcnDz3
— paayal rajput (@starlingpayal) November 4, 2026














Click it and Unblock the Notifications
