Scene Movie First Review: సూర్య 'సీన్' మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతంలో కంగువా, రెట్రో సినిమాలతో ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన ఆయన ఈ ఏడాది వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తో అలరించారు. తొలుత కరుప్పు(తెలుగులో వీరభద్రుడు) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు సూర్య. ఈ మూవీని కోలీవుడ్ దర్శకుడు ఆర్. జే. బాలాజీ తెరకెక్కించారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ క్రమంలో సూర్య కెరీర్ లో బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ సినిమాగా కరుప్పు నిలిచింది. ఆ తర్వాత టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో విశ్వనాథ్ అండ్ సన్స్ అనే సినిమా చేశారు సూర్య. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీలో సూర్య సరసన మలయాళం బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా నటించింది.
ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లకుపైగా వసూల్లు రాబట్టింది. మరోవైపు ఈ మూవీలో తన స్టైలిష్ నటనతో గజినీ సినిమాలోని సంజయ్ రామస్వామి క్యారెక్టర్ ను గుర్తు చేశారు సూర్య. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు సీన్ అనే సినిమాతో మరోసారి ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యారు సూర్య. ఓ స్టార్ హీరో ఇలా ఏడాదికి మూడు సినిమాలతో రావడం అంటే మామూలు విషయం కాదు. అది సూర్యకే సాథ్యం అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
అయితే సీన్ మూవీ నవంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళం స్టార్ డైరెక్టర్ జీతూ మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక మలయాళం యంగ్ హీరో నస్లేన్ ఈ చిత్రంలో విలన్ గా నటించాడు. అలాగే నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించింది. ట్రైలర్, క్యాస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండటంతో ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో దీనిపైనే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక రీసెంట్ గా ఈ మూవీ ప్రివ్యూ షో ను లండన్ లోని ఓ థియేటర్ లో ప్రదర్శించారని.. ఈ సినిమాను కొంతమంది ఓవర్సీస్ బయ్యర్స్ కు ప్రదర్శించారట మేకర్స్. వాళ్ల నుంచి వచ్చిన టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సీన్ మూవీ ఫస్టాఫ్ లో సూర్య ఊరమాస్ సీన్స్ తో పాటు నస్లేన్ సైకో పాత్ సన్నివేశాలు ప్రేక్షకులకు థియేటర్లలో మంచి థ్రిల్ ను అందిస్తాయని టాక్ వినిపిస్తోంది. అలాగే ఇంటర్వెల్ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఇక సెకండాఫ్ లో నస్లేన్ క్యారెక్టర్ సూర్యను కూడా డామినేట్ చేస్తుందని సమాచారం. మొత్తానికి ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుందని చెబుతున్నారు. మరి ఫుల్ రివ్యూ కోసం నవంబర్ 6 వరకు ఆగాల్సిందే..












Click it and Unblock the Notifications
