రాజ్ నిడిమోరు భార్య సంచలన పోస్ట్..'కర్మ' అంటూ సమంతకు కౌంటర్..?

గత కొంతకాలంగా సమంత రెండో పెళ్లి గురించి విపరీతమైన చర్చ సాగుతుంది. సమంత హీరో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

విడాకుల తర్వాత సమంత ఒంటరికి ఉంటున్నారు. ఇదిలా ఉంటే సమంతకు రెండో పెళ్లికి సంబంధించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ సమంత మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోనని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. అయితే గత కొంతకాలంగా సమంత బాలీవుడ్‌ దర్శకుడు రాజు నిడుమోరుతో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత ఇటీవల నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు.

Raj Nidimoru wife shyamala post goes viral media

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమాకు అన్ని పనులు రాజు నిడుమోరు దగ్గరుండి చూసుకున్నారు.అలాగే ఈ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. ఇటీవల సమంత తిరుపతి వెళ్లిన సమయంలో కూడా రాజు నిడుమోరు ఆమెతోనే ఉన్నారు. తాజాగా సమంత రాజు నిడుమోరు భుజంపై వాలిన ఫొటో సంచలనంగా మారింది.

ఆ సమయంలో రాజు నిడుమోరు భార్య శ్యామల షేర్ చేసిన పోస్ట్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది. 'నా గురించి మాట్లాడేవారికి, నా తరఫున మాట్లాడేవారికి, నేను చెప్పేది వినేవారికి, నా గురించి రాసే వారికి, నా కోసం ఆలోచించేవారందరికీ దేవుడు ఆశీర్వాదం, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను' అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

రాజు నిడుమోరు భార్య శ్యామల ఇన్‌స్టాగ్రామ్‌ను ఓసారి పరిశీలిస్తే..2023 తర్వాత తన భర్తకు సంబంధించిన ఫొటోలు కానీ, ఆయన సినిమా విషయాల గురించి కూడా ఆమె తన సోషల్ మీడియా ఎలాంటి ఆప్డేట్ ఇవ్వలేదు. గతంలో భర్త సినిమాలను ప్రమోట్ చేసిన రాజు నిడుమోరు భార్య శ్యామల ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దీంతో ఇప్పటికే రాజు నిడుమోరుతో భార్య విడిపోయారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

శ్యామల తాజాగా మరోసారి రాజు నిడుమోరు భార్య తన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.'మంచి కర్మను సృష్టించండి.. ప్రజలకు సాయం చేయండి..నీ చుట్టూ ఉన్న అందరితో న్యాయంగా వ్యవహరించండి' అనే కొటేషన్‌తో కూడిన ఉన్న ఫొటోను షేర్ చేసింది. సమంత, రాజు నిడుమోరుకు శ్యామల కౌంటరిచ్చిందనే అంతా భావిస్తున్నారు. వారి కారణంగా తన జీవితం నాశనం అవుతుందనో, లేదంటే తనకు అన్యాయం జరుగుతుందనేది చెప్పడానికి శ్యామలి ఈ దారిని ఎంచుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ, ప్రస్తుతం సమంత-రాజు నిడుమోరు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+