మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ కీలక నిర్ణయం
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత దర్శకుడిగా రాజమౌళి క్రేజ్, ఫాలోయింగ్ హాలీవుడ్ వరకు వెళ్లింది. ఆర్ఆర్ఆర్‌ను రాజమౌళి ఆస్కార్ వరకు తీసుకెళ్లాడు. నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చింది. అలా రాజమౌళి క్రేజ్ ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా పెరిగిపోయింది. అందుకే మహేష్ బాబుతో చేయబోతోన్న మూవీని ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నారు.
ఆఫ్రికా అడవుల నేపథ్యంలో, ఇండియానా జోనస్ లాంటి బ్యాక్ డ్రాప్‌తో ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు విజయేంద్ర ప్రసాద్ కథను అల్లుతున్నారు. ఇక రాజమౌళి టీం కూడా స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో పడింది. ఈ ఏడాది చివరి కల్లా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్దంలోనే షూటింగ్ జరగనుంది.

ఓ సినిమాను రెండు భాగాలుగా తీయలానే ట్రెండ్‌ను రాజమౌళి మళ్లీ పైకి తీసుకొచ్చాడు. బాహుబలిని అదే ఫార్మూలాతో రాసుకున్నాడు. ముందు ఒక పార్ట్ అనుకుంటే.. తరువాత రెండు పార్టులుగా మలిచాడు. కేజీయఫ్‌ని సైతం రెండు పార్టులుగా తీయమని రాజమౌళియే ప్రశాంత్ నీల్ కు సలహా ఇచ్చినట్లు సమాచారం. అలా రెండు పార్టులు, సీక్వెల్స్ అనే ట్రెండ్ మళ్లీ రాజమౌళి మొదలు పెట్టినట్టుగా అయింది. తాజాగా మహేష్ బాబుతో చేస్తోన్న సినిమాను కూడా రెండు పార్టులుగా తీయబోతున్నారు. దీనిపై అనేక రూమర్లు వచ్చాయికానీ చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం రెండు పార్టులు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అంటే కనీసం వీటిని తీయడానికే నాలుగైదు సంవత్సరాలు పడుతుందనే అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications