రేవంత్‌కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు, హరీష్ పార్టీ మార్పు పై..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేటీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అటు బీఆర్ఎస్ సైతం రేవంత్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన తెలంగాణలోనూ రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలోనే సీఎం రేవంత్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు.

పొలిటికల్ ఫైట్ లీగల్ వార్ గా మారుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. గ్లోబరీనా టెక్నాలజీస్ తన బినామీ సంస్థగా రేవంత్ ప్రచారం చేయటం పైన కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఆ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. రేవంత్‌రెడ్డికి లీగల్‌ నోటీసులు జారీ చేసారు. రేవంత్‌ 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గ్లోబరీనా తన బినామీ అనటం, సీబీఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించాననడం అవాస్తవమని వివరించారు. ఆ సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు గానీ.. యాజమాన్య హక్కులుగానీ లేవని స్పష్టం చేసారు. దీనిపై లైడిటెక్టర్‌, సీఐడీ సహా ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. అత్యున్నత పదవిలో ఉండి బాధ్యతారహితంగా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

 కేటీఆర్ బర్త్ డే దావత్ ఇస్తే - రేవంత్ ఆసక్తి కర వ్యాఖ్యలు..!!
కేటీఆర్ బర్త్ డే దావత్ ఇస్తే - రేవంత్ ఆసక్తి కర వ్యాఖ్యలు..!!
ktr-legal-notice-to-revanth-reddy-over-exam-irregularities-allegations-seeks-public-apology

హరీష్ రావు పార్టీ మారటం పైనా క్లారిటీ

సీఎం రేవంత్ రాజకీయ లబ్ధి కోసమే తన ప్రతిష్ఠను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. నోటీసుల్లో పేర్కొన్న విధంగా గడువులోపు క్షమాపణ చెప్పకుంటే సీఎం రేవంత్‌పై సివిల్‌, క్రిమినల్‌ చర్యలతోపాటు పరువు నష్టం దావావేస్తామని వెల్లడించారు. ఇక ప్రధాని ఇంటి ముందు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, కర్ణాటక, కేరళ సీఎంలు ధర్నా చేస్తే.. రేవంత్‌రెడ్డి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. రేవంత్‌ బావమరిదికి సింగరేణి కాంట్రాక్టులు, అమృత్‌ పథకం కాంట్రాక్టుల కోసమే మోదీకి భజన చేస్తున్నారని ఆరోపించారు. అదే విధంగా హరీష్ పార్టీ మార్పు ప్రచారంలో వాస్తవం లేదని కేటీఆర్ స్పష్టం చేసారు. 2027లో ప్రజాసమస్యలపై పాదయాత్ర చేస్తానని చెప్పారు. అయితే తనకు సీఎం పదవిపై ఆశ లేదని, కేసీఆర్‌ను మరోసారి సీఎం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తేల్చి చెప్పారు. బీజేపీతో పొత్తు ఏమీ ఉండదని కేటీఆర్ స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+