అర్ధరాత్రి ఓ నాలుగు ఊరడింపు మాటలు మాట్లాడితే పనైపోతుందా ప్రధాని సర్.. : ప్రముఖ నటి

పేపర్ లీకులు, ఢిల్లీ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా 2024 ఫిబ్రవరిలో అమలులోకి తీసుకువచ్చిన ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ కు మరింత పదును పెట్టబోతోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అర్ధరాత్రి ఓ వీడియోను సైతం రిలీజ్ చేశారు. ఈ వ్యవస్థాగత లోపాల గురించి మాట్లాడిన కొన్ని గంటల్లోనే కేంద్రం ఈ దిశగా అడుగులు వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ పరిణామాలపై బాలీవుడ్ నటి, ఐక్యరాజ్యసమితి పర్యావరణ రాయబారి, సామాజిక కార్యకర్త దియా మీర్జా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చేసిన తాజా వ్యాఖ్యల పట్ల స్పందించారు. కేంద్ర ప్రభుత్వ తాత్సార ధోరణిని నిరసిస్తూ ఆమె ఘాటు ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత అర్ధరాత్రి ప్రధాని మోదీ చేసిన ప్రకటన తీవ్ర నిరాశను మిగిల్చిందని వ్యాఖ్యానించారు.

Dia Mirza Raises Voice for Students Reform as PM Promises Fast-Track Courts Students Demanding Rights

పరీక్షల లీకేజీల వల్ల తీవ్రంగా నష్టపోయిన విద్యార్థులు, తమ పిల్లల భవిష్యత్తు నాశనమైందని ఆవేదన చెందుతున్న తల్లిదండ్రుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి కనీస సానుభూతి లేదని దియా మీర్జా ఆరోపించారు. తమ హక్కుల సాధన కోసం రోడ్లపైకి వచ్చి పోరాడుతున్న విద్యార్థులు, లడఖ్ ప్రయోజనాల కోసం దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్‌చుక్‌ వంటి సామాజిక కార్యకర్తలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా పరీక్షల లీకేజీలపై తీవ్ర ఆందోళనలు జరుగుతున్నప్పటికీ.. దీనిపై స్పందించడానికి ప్రధాని మోదీ దాదాపు 47 రోజుల సుదీర్ఘ సమయం తీసుకోవడం ఎంతవరకు సమంజసమని దియా మీర్జా ప్రశ్నించారు. ఇన్ని రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చి నాలుగు మాటలు మాట్లాడినప్పటికీ.. ఆశించిన భరోసా లభించలేదని అన్నారు. లక్షలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే ప్రధాని మోదీ ప్రకటనలో వారి పట్ల ఎలాంటి ఆత్మీయత లేదా సానుకూల దృక్పథం కనిపించలేదని పేర్కొన్నారు.

సన్నీ డియోల్‌ నటించిన ఇక్కా చిత్రంలో నటించారు దియా మీర్జా. ప్రస్తుతం ఆపరేషన్ సఫేద్ సాగర్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో వైమానిక దళం చేపట్టిన వీరోచిత ఘట్టాల ఆధారంగా ఇది తెరకెక్కింది. కార్గిల్ విజయానికి నిదర్శనంగా రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. ఆగస్టు 7వ తేదీన నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+