మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కీలక అడుగు.. వరంగల్ దశ తిరుగుతుంది!

వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ పనులలో వేగం పెరిగింది. ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ గా తెలంగాణా రాష్ట్రంలోని మామునూరు ఎయిర్ పోర్ట్ ఉండేది. 1930లో 1875 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మితం అయిన ఈ ఎయిర్ పోర్ట్ ఇక్కడ పరిశ్రమలకు ఆజంజాహీ మిల్స్, సిర్పూర్ కాగజ్ నగర్ కాగితాల పరిశ్రమ వంటి వాటికి సేవలను అందించింది.

మామునూరు ఎయిర్ పోర్ట్ పునర్నిర్మాణంపై కీలక అప్డేట్

ఆపై రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ వారు మామునూరు ఎయిర్ పోర్ట్ ను వాడుకున్నారు. ఆపై వాయుదూత్ సేవలకు ఇది ఉపయోగపడింది . ఆపై మూతపడిన మామునూరు ఎయిర్ పోర్ట్ మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణానికి నోచుకుంటుంది. ఇప్పటికే మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ జరిపి AAI కి అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం, మామునూరు ఎయిర్ పోర్ట్ ను త్వరిత గతిన నిర్మించాలని సంకల్పించింది.

mamnoor airport telangana prestigious mamnoor airport works speed up aai visited airport lands

496.86 కోట్ల రూపాయల వ్యయంతో మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణం

ఈ క్రమంలో కేంద్రానికి పదే పదే విజ్ఞప్తులు చేస్తుంది. ఇటీవల తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని, పనులు వేగవంతం చెయ్యాలని కోరగా అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఫలితంగా 496.86 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించటానికి సూత్రప్రాయ అనుమతులు మంజూరు చేసింది. ఈ క్రమంలో తాజాగా మరో కీలక అడుగు పడింది.

రూ.21 కోట్లతో ప్రహరీ నిర్మాణం టెండర్లు

మామునూర్ విమానాశ్రయ అభివృద్ధి పనులకు రన్‌వే పునర్నిర్మాణం, లింక్ ట్యాక్సీవే నిర్మాణం,ఐసోలేషన్ బే ఏర్పాటు,అత్యవసర ప్రవేశ రోడ్డు నిర్మాణం పనులపై ఎయిర్పోర్ట్ స్థలాన్ని ఎయిర్పోర్ట్ అధికారులు పరిశీలించారు. మరో వైపు మామునూర్ ఎయిర్‌పోర్టు ప్రీ బిడ్ సమావేశం హనుమకొండలో జరిగింది. మొదటి టెండర్ రూ.21 కోట్లతో ప్రహరీ నిర్మాణం టెండర్లు పూర్తయ్యాయి.

టెండర్ల ప్రక్రియ ఇలా

రెండో దశలో రూ.203.49 కోట్లతో టెర్మినల్ భవనం, ఏప్రాన్, ఫైర్ స్టేషన్, పెరిమీటర్ రోడ్, లింక్ ట్యాక్సీ వే, డ్రైనేజీ, ఐసోలేషన్ బే, ఎమర్జెన్సీ రోడ్ నిర్మించనున్నారు. 3వ దశలో రూ.297 కోట్లతో టెండర్ పిలువనున్నారు. కాగా మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనుల్లో టెండర్ ప్రక్రియ వేగం పుంజుకున్నప్పటికీ, ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్ ఇంకా లభించలేదు. టెండర్ దక్కించుకున్న సంస్థ 180 రోజుల్లో పర్యావరణ అనుమతులు పొందాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+