నిజం చెప్పాలంటే.. ఈ అవార్డు నాది కాదు..!!
కేంద్ర ప్రభుత్వం శనివారం దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను గుర్తించి పద్మ పురస్కారాలను ప్రకటించింది. తెలుగు సినీ పరిశ్రమలో ఐదు దశాబ్దాలకు పైగా నిరంతరం సేవలందిస్తున్న సీనియర్ నటుడు మురళీ మోహన్‌కు ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆయనతో పాటు కమేడియన్ రాజేంద్ర ప్రసాద్, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం, కళ), వేంపటి కుటుంబశాస్త్రి (సాహిత్యం, విద్య) ఉన్నారు.
గొప్పవి, శాశ్వతమైనవిగా..
అయిదు దశాబ్దాల సినీ ప్రస్థానం ఉన్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు కళా విభాగంలో పద్మశ్రీ లభించింది. 240కి పైగా చిత్రాలలో నటించి, తన బహుముఖ ప్రజ్ఞతో విభిన్న పాత్రలను పోషించారు. వారికి పద్మ అవార్డు లభించడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పద్మ అవార్డ్స్ విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలుగు సినీ ప్రముఖులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లకు పద్మశ్రీ రావడం పట్ల ఎంతో గర్విస్తున్నానని, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు వాళ్లు అందించిన సేవలు గొప్పవి, శాశ్వతమైనవిగా అభివర్ణించారు.

పద్మశ్రీ అవార్డు రావడం పట్ల..
తనకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల తాజాగా రాజేంద్రప్రసాద్ స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు ప్రేక్షకులకు దీన్ని అంకతం చేశారు. పద్మశ్రీ అవార్డు లభించిన ఈ సందర్భం తన జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజుగా పేర్కొన్నారు. పద్మశ్రీ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వం తన పేరును ప్రకటించిన తర్వాత ఆనందంతో ఉప్పొంగిపోయానని, ఒక నటుడిని గుర్తించి, ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.
దక్కింది నాకు కాదు..
ఈ పురస్కారం దక్కింది తనకు కాదని, 48 సంవత్సరాలుగా తనను నటుడిగా కాకుండా.. ఇంట్లో మనిషిగా, గుండెల్లో పెట్టుకుని ఆదరించిన ప్రేక్షకులదని రాజేంద్రప్రసాద్ అన్నారు. తెలుగు ప్రేక్షకుల నుంచి తనకు దక్కిన ఆప్యాయతకు కృతజ్ఞతుడినై ఉంటానని, అదే తన అదృష్టమని చెప్పారు. ఆ ప్రేమే తనను ఇక్కడిదాకా నడిపించిందని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తనను సొంతబిడ్డలా ఆదరించారని, ఈ రుణం జన్మలో తీర్చుకోలేనని












Click it and Unblock the Notifications