డిసెంబర్ లో పుష్ప 2తో ఢీకొట్టనున్న గేమ్‌ఛేంజర్‌!!

మెగాస్టార్ ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలికి మధ్య గ్యాప్ వచ్చిందన్న వార్తలు సినీ ఇండస్ట్రీలోనే కాదు ప్రజలలో కూడా పెద్దఎత్తున చర్చకు కారణమైన విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ చేసిన పనికి నాగబాబు రియాక్ట్ అవుతూ పోస్ట్ పెట్టడం, ఆ పోస్టుపైన ఘాటుగా స్పందించిన అల్లు అర్జున్ రివర్స్ అటాక్ చేయడంతో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయని ప్రజలలో పెద్దఎత్తున చర్చ జరిగింది.

అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్
అయితే తాజాగా మరో మారు అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ అన్నది ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా గేమ్‌ ఛేంజర్‌. ఈ సినిమా పైన మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు.

ram charan Game changer to clash with allu arjun Pushpa 2 in December

గేమ్‌ ఛేంజర్‌ కీలక అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు
రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రస్తుతం ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు బిజీగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా విడుదల పైన రామ్ చరణ్ అభిమానులతో పాటు, సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు గేమ్‌ ఛేంజర్‌ సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు.

పుష్ప 2 తో ఢీకొట్టనున్న గేమ్‌ ఛేంజర్‌
ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం రాయన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు రామ్ చరణ్ గేమ్‌ ఛేంజర్‌ విడుదల తేదీని చెప్పేశారు. ఈ సినిమాను డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా తీసుకురాబోతున్నట్టు దిల్ రాజు ప్రకటించారు . అయితే క్రిస్మస్ కు అల్లు అర్జున్ పుష్ప 2 థియేటర్లలో సందడి చేస్తుంది. ఒకే నెలలో ఇద్దరి సినిమాలు రిలీజ్ కానున్న క్రమంలో పుష్ప 2 తో గేమ్‌ ఛేంజర్‌ ఢీకొట్టనుంది.

అల్లు అర్జున్ , రాం చరణ్ మధ్య సినిమాల చిచ్చు
ఇక రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇద్దరి సినిమాలు డిసెంబర్ లో కొట్లాటకు సిద్ధమవుతున్న వేళ ఈ సినిమాలలో ఎవరి సినిమా పై చేయిగా నిలుస్తుంది అన్నది ఫ్యాన్స్ లో ఉత్కంఠకు కారణమైంది. ఏది ఏమైనా ఇద్దరు హీరోల మధ్య మరో మారు సినిమాల రిలీజ్ చిచ్చు పెడుతుందని టాక్ వినిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+