ఆ హీరోయిన్‌కి నరకం చూపించిన రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ , అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, తన రెండో సినిమా మగధీరతో ఇండస్ట్రీ కొట్టి స్టామినా చూపించాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.
డిసెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది. అదేంటంటే.. రామ్ చరణ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను తెగ ఏడిపించేవాడట. వీరిద్దరు మగధీర సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో కాజల్ అగర్వాల్‌ను ఆట పట్టిస్తూ తెగ అల్లరి చేసేవాడట రామ్ చరణ్. ఆ సినిమాలో గుర్రానికి ఏకంగా కాజల్ పేరు పెట్టి పిలిచేవారట రామ్ చరణ్. కాజల్ సైతం రామ్ చరణ్‌ను అదే రీతిలో సరదాగా ఏదో ఒకటి అంటూ టీజ్ చేసేదట.

అయినప్పటికి రామ్ చరణ్ డామినేషన్ ఎక్కువగా ఉండేదట. దీంతో ఏం చేయలేక కాజల్ సైలెంట్ అయ్యేదట. ఈ విషయాన్ని కాజల్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే ఇదింతా కూడా సరదాగానే జరిగేదని ఆమె తెలిపింది. మగధీర తర్వాత రామ్ చరణ్ , కాజల్ ఇద్దరూ కలిసి మరో రెండు సినిమాల్లో నటించారు. గోవిందుడు అందరివాడేలే, నాయక్ సినిమాల్లో కాజల్ చెర్రీతో జత కట్టింది. ఇక కాజల్ కెరీర్ విషయానికి వస్తే..పెళ్లి , బిడ్డను కన్న తర్వాత వరుస సినిమాల్లో నటిస్తోంది. బాలకృష్ణతో భగవత్ కేసరి సినిమాలో నటించి హిట్ కొట్టింది. తాజాగా ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications