రామ్ చరణ్ ఉపాసనల ప్రేమ... వాలంటైన్స్ డే పోస్ట్ వైరల్!!
ఈరోజు వాలెంటైన్స్ డే. ప్రేమికులంతా ఎంతో ఇష్టంగా జరుపుకొనే ప్రేమికుల దినోత్సవం. ప్రేమికుల దినోత్సవ సందర్భంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు ఎక్స్ వేదికగా తమ ప్రేమ భావనను తమకు ప్రియమైన వారితో పంచుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వాలెంటెన్స్ డే సందర్భంగా సెలబ్రిటీలు ఎవరు పోస్ట్ చేసినా అవి వైరల్ గా మారతాయి.
వాలెంటెన్స్ డే ని పురస్కరించుకొని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. రామ్ చరణ్, ఉపాసన, తమ ముద్దుల కుమార్తె క్లింకారాలతో తమ ప్రేమ భావనను వ్యక్తం చేశారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఒకరి చేతిలో ఒకరి చేతులు వేసి, ఇద్దరు చేతుల మధ్యలో క్లింకారా చేతిని తీసుకొన్న ఫోటోను షేర్ చేసి దానికి లవ్ సింబల్ జతచేసి తమ ప్రేమబంధాన్ని తెలియజేశారు.

తమ ప్రేమ తమ కూతురు క్లింకార రూపంలో తమ ముందుకు వచ్చిందన్న భావనను ఆమె ఈ పోస్ట్ ద్వారా వ్యక్తం చేశారు. రామ్ చరణ్ ఉపాసనల ది కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న, ఒకరికి ఒకరు గౌరవించుకునే, ఇద్దరు స్నేహపూర్వకంగా మెదిలే ప్రేమ బంధం. రామ్ చరణ్, ఉపాసన చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు.
2010లో విడుదలైన ఆరెంజ్ సినిమా తర్వాత వారిద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగి, డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. రెండేళ్లపాటు ప్రేమలో ఉన్న చరణ్ ఉపాసనలు ఇరు కుటుంబాల అంగీకారంతో 2012 జూన్ 14వ తేదీన వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న 11 సంవత్సరాల తరువాత వీరి ప్రేమకు కానుకగా కుమార్తె క్లింకార జన్మించింది.
♾️❤️ pic.twitter.com/ZkNd6GeKwW
— Upasana Konidela (@upasanakonidela) February 14, 2024
అప్పట్నుంచి ఈ జంట ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వారు ఎప్పటికప్పుడు తమ ప్రేమకు గుర్తుగా పుట్టిన తమ ముద్దుల పట్టి క్లింకారను చూసుకుంటూ మురిసిపోతున్నారు. ఈ వాలెంటైన్స్ డే ను వారు క్లింకార సాక్షిగా జరుపుకుంటున్నారు. ఇదే విషయాన్ని తమ ప్రేమ భావనను ఎక్స్ లో ఉపాసన పంచుకున్నారు.












Click it and Unblock the Notifications