''గాడిద కూడా సింహం అనుకుంటుంది''.. అతన్ని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ ...?

రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పగానే ఒకప్పుడు శివ, అంతం, క్షణం క్షణం వంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమాలు గుర్తుకు వచ్చేవి. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చెప్పగానే పిచ్చి పిచ్చి సినిమాలు , అమ్మాయిలతో రొమాన్స్ మాత్రమే గుర్తుకు వస్తున్నాయి. అయితే రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా ఎలా ఉన్నప్పటికీ ఆయనలో గొప్ప టెక్నీషియన్ ఉన్నారనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ చాలా అమ్మాయిలతో ఫొటోలు దిగుతుంటారు.

ram gopal varma tweet goes viral

వర్మతో ఫొటోలు దిగడం వల్ల సెలబ్రిటీలుగా మారిన లిస్ట్ కూడా పెద్దదే. అరియానా, అషు రెడ్డి, ఇనయా సుల్తానా వంటి వారు రామ్ గోపాల్ వర్మతో ఫొటోలు దిగిన తర్వాతే పాపులారిటీని సొంతం చేసుకున్నారు. రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులపై సెటైరికల్ మూవీస్ తీసి వారి తనకున్న కసి తీర్చుకున్నారు. ఇక పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని ప్రకటించిన మరుక్షణమే తాను కూడా పిఠాపురంలో పోటీ చేస్తున్నా అంటూ షాకిచ్చారు.

ram gopal varma tweet goes viral

తాజాగా రామ్ గోపాల్ వర్మ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ''ఎక్కువ శ్రద్ధ తీసుకుని అటేన్షన్ చూపిస్తే.. గాడిద కూడా సింహం అని అనుకుంటుంది'' అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అయితే ఈ పోస్ట్ రామ్ గోపాల్ వర్మ ఎవర్ని ఉద్దేశించి చేసి ఉంటారా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మెజార్టీ నెటిజన్లు మాత్రం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించే రామ్ గోపాల్ వర్మ ఈ ట్వీట్ చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆయన చేసిన పోస్ట్ పొలిటికల్ పరంగానే చేశాడని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+