రామ్ చరణ్– సుకుమార్ సినిమా లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. జూన్ 4 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఆచార్య, గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్స్ తర్వాత రామ్ చరణ్ పెద్ది సినిమాతో భారీ హిట్ కొట్టడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.

అయితే పెద్ది సినిమా తర్వాత రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. RC17 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ దసరా పండక్కు మూవీ లాంచ్ జరగనున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో సుకుమార్ పక్కా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక నాన్ స్టాప్ గా 12 నెలల్లో సినిమాను పూర్తి చేసి 2028 సంక్రాంతి లేదు సమ్మర్ టార్గెట్ గా మూవీని తీసుకురావాలని అటు సుకుమార్- రామ్ చరణ్ సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

RamCharan Sukumar movie has been fixed reports suggest the film will commence during Dasara viral

ఇక ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి అప్డేట్ అధికారికంగా రాలేదు. కానీ 2024 మార్చిలో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ ఫొటోను పోస్ట్ చేసింది. సుకుమార్, రామ్ చరణ్ రంగులు పూసుకుంటున్న ఫోటోతో పాటు రెండు గుర్రాలు ఉన్న పోస్టర్​ ను కూడా షేర్ చేసింది. రోరింగ్ టూ కాన్కర్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేసింది. అలాగే రామ్ చరణ్- సుకుమార్ సినిమా ఇంట్రో సీన్ పై గతంలో దర్శకధీరుడు రాజమౌళి షాకింగ్ కామెంట్స్ కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. RC17 సినిమా గురించి రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సినిమాలో వచ్చే మొదటి ఐదు నిమిషాలు ప్రేక్షకుడి కళ్లు చెదిరిపోయేలా ఉంటాయని అన్నారు. థియేటర్​లో సీటుకు ప్రేక్షకులు అతుక్కుపోతారని చెప్పారు. దాంతో సినిమాపై అప్పటి నుంచి భారీ హైప్ క్రియేట్ అవుతూ వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+