యాంకర్ రష్మికి అవకాశాలు రాకుండా అడ్డుపడుతున్న స్టార్ డైరెక్టర్
బుల్లితెరపై ఏడేళ్ల క్రితం ఒక వెలుగు వెలిగిన ముఖం.. యూత్‌లో క్రేజ్ అంటే ఇట్టే గుర్తుకొచ్చే పేరు.. అదే యాంకర్ రష్మీ గౌతమ్. 'జబర్దస్త్' షోతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లోకి సుపరిచితురాలైంది. కుర్రకారును తన గ్లామర్‌తో, పంచ్‌లతో కట్టిపడేసిన ఈ భామ.. అటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తోనే ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా వంటి ప్రముఖ చానెళ్లలో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. 'గుంటూరు టాకీస్' లాంటి సినిమాల్లో హీరోయిన్‌గానూ మెరిసింది. సినిమాల్లో పెద్దగా హిట్లు రాకపోయినా, యాంకరింగ్‌లో మాత్రం ఈమె హవా ఒకానొక దశలో పీక్స్‌లో నడిచింది.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు
కానీ, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదన్నట్లుగా.. ఇప్పుడు రష్మీ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోతుందనే చర్చ తెరపైకి వచ్చింది. ఒకప్పుడు ఈటీవీలో ఏ ఈవెంట్ జరిగినా, ఏ షో పడినా రష్మీనే యాంకర్. కానీ కాలక్రమేణా ఆ సీన్ పూర్తిగా మారిపోయింది. రెగ్యులర్‌గా చేసిన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో నుంచి ఆమెను పక్కన పెట్టి, ఆ స్థానంలోకి ప్రదీప్‌ను తీసుకున్నారు. ఇది ఆమెకు తగిలిన అతిపెద్ద షాక్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం 'జబర్దస్త్' షో మాత్రమే మిగిలింది. ఆ షో పరిస్థితి కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ అది కూడా ఆగిపోతే, ఒకప్పుడు బుల్లితెరను ఏలిన ఉదయభాను, ఝాన్సీ, శిల్పా చక్రవర్తిలాగే రష్మీ కూడా కనిపించకుండా కనుమరుగైపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎందుకు తగ్గాయి అవకాశాలు?
అసలు ఇంతింత క్రేజ్ ఉన్న రష్మీకి సడన్‌గా అవకాశాలు ఎందుకు తగ్గాయి? సుడిగాలి సుధీర్, ప్రదీప్ లాంటి వాళ్లు ట్రెండ్‌ను మార్చేయడం వల్లేనా? లేక నిజంగానే తెరవెనుక ఎవరైనా ఆమెను తొక్కేస్తున్నారా? ఇప్పుడు టాలీవుడ్ సర్కిళ్లలో గట్టిగా వినిపిస్తున్న వార్తల ప్రకారం.. టాలీవుడ్‌కు చెందిన ఓ టాప్ డైరెక్టర్ కావాలనే రష్మీకి ఆఫర్లు రాకుండా అడ్డుకుంటున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో మంచి హిట్లున్న ఆ పెద్ద డైరెక్టర్‌కు, కొన్ని పాపులర్ టీవీ షోలలో జడ్జిగా వ్యవహరించిన అనుభవం కూడా ఉందట.
మరి ఆయనెవరు? రష్మీపై ఆయనకు అంత కక్ష ఎందుకు? అవకాశాలు లేకుండా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్న ప్రశ్నలకు మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా, ఒక వెలుగు వెలిగిన స్టార్ యాంకర్ ఇలా సడన్‌గా సైడైపోవడం బుల్లితెర ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై మీరేమంటారు? రష్మీ కెరీర్ వెనకడుగు వేయడానికి అసలు కారణం ఎవరిదంటారో కామెంట్ చేయండి!














Click it and Unblock the Notifications
