అమెరికాలో గెలిచిన కర్ణాటక అల్లుడు.. సెనేట్‌లో తొలి ముస్లిం సభ్యుడిగా రికార్డు!

అమెరికా రాజకీయ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖించబడింది. డెమోక్రటిక్ పార్టీ తరఫున మిచిగాన్ నుంచి పోటీ చేసిన డాక్టర్ అబ్దుల్ ఎల్-సయ్యద్(42) అమెరికా సెనేట్ రేసులో ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్‌ను ఓడించడం ద్వారా యూఎస్ సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం సభ్యుడిగా ఎల్-సయ్యద్ చారిత్రాత్మక రికార్డు సృష్టించారు. అత్యంత ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎదురైన వ్యక్తిగత తీవ్ర విమర్శలను సైతం తట్టుకుని ఆయన విజయం సాధించడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా నియంతలకు కష్టకాలం-మళ్లీ పాత రూట్లోకి జనం..! సీజేపీ విశ్లేషణ..!
ప్రపంచవ్యాప్తంగా నియంతలకు కష్టకాలం-మళ్లీ పాత రూట్లోకి జనం..! సీజేపీ విశ్లేషణ..!

కర్ణాటక మూలాలు.. భట్కల్ అల్లుడు!
అబ్దుల్ ఎల్-సయ్యద్ విజయంతో కర్ణాటకలోని తీర ప్రాంత పట్టణం భట్కల్, రాజధాని బెంగళూరులో పండుగ వాతావరణం నెలకొంది. అబ్దుల్ ఎల్-సయ్యద్ భార్య డాక్టర్ సారు జుకాకు కుటుంబ మూలాలు భట్కల్‌లోనే ఉన్నాయి. సారా తాతయ్య జుకాకు షంషుద్దీన్ పూర్వపు మైసూర్ రాష్ట్రంలో బీడీ జత్తి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆర్థిక శాఖ డిప్యూటీ మంత్రిగా సేవలందించారు. సారా బెంగళూరులో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. మిచిగాన్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో రోడ్స్ స్కాలర్ అయిన ఎల్-సయ్యద్‌ను ఆమె వివాహం చేసుకున్నారు.

Democrat Abdul El-Sayed Wins Michigan Senate Race Becomes First Muslim US Senator Full Details Here

తన భార్య తరఫు దక్షిణాది భారతీయ కుటుంబంతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ఎల్-సయ్యద్ పలుమార్లు గుర్తు చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో అబ్దుల్ ఎల్-సయ్యద్ సరదాగా మాట్లాడుతూ.. "నేను 20 ఏళ్లుగా దక్షిణాది భారతీయ కుటుంబంతో వివాహ బంధంలో ఉన్నాను. నా అరబ్ మూలాల కంటే నేనే ఎక్కువగా భారతీయుడినేమో!" అని పేర్కొనడం ఆయన భారతీయ సంబంధాన్ని చాటిచెబుతోంది.

ఇజ్రాయెల్ సైనిక చర్యపై డొనాల్డ్ ట్రంప్‌తో తీవ్ర వివాదం
మిచిగాన్ సెనేట్ ఎన్నికల ప్రచారంలో ఇజ్రాయెల్-గాజా యుద్ధం ప్రధాన అంశంగా మారింది. గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్యలను నిరభ్యంతరంగా అమెరికా అందిస్తున్న సైనిక సహాయాన్ని అబ్దుల్ ఎల్-సయ్యద్ తీవ్రంగా నిరసించారు. గాజాలో జరుగుతున్నది మానవహక్కుల ఉల్లంఘనేనని ఆయన గళమెత్తారు.

నెతన్యాహుకు ట్రంప్ బిగ్ షాక్ - ఎన్నికల్లో ఎదురుదెబ్బతో సంచలన నిర్ణయం..!
నెతన్యాహుకు ట్రంప్ బిగ్ షాక్ - ఎన్నికల్లో ఎదురుదెబ్బతో సంచలన నిర్ణయం..!

దీనిపై రిపబ్లికన్ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా రంగంలోకి దిగి అబ్దుల్ ఎల్-సయ్యద్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అబ్దుల్ ఎల్-సయ్యద్‌కు ఇజ్రాయెల్, యూదులంటే ద్వేషమని ట్రంప్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను అబ్దుల్ ఎల్-సయ్యద్ ఖండించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలను విమర్శించడాన్ని, యూదుల పట్ల వ్యతిరేకతగా భావించకూడదని ఆయన స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ ప్రత్యర్థి మైక్ రోజర్స్ ఇద్దరూ ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలకు మద్దతు ఇస్తూ అబ్దుల్ ఎల్-సయ్యద్‌ ను టార్గెట్ చేసినప్పటికీ.. మిచిగాన్ ఓటర్లు మాత్రం డెమోక్రటిక్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయ్యద్ వైపే మొగ్గు చూపి రికార్డు విజయాన్ని కట్టబెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+