తన గెస్ట్‌హౌస్‌లో రష్మికను మహరాణిలా చూసుకుంటున్న సల్మాన్ ఖాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అతనికి భారీగా సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. సినిమా షూటింగ్ కు వచ్చే సమయంలో భారీ సెక్యూరిటీతో వస్తున్న సల్మాన్ ఖాన్ తనతోపాటు తన తోటి నటీనటులకు కూడా అంతేస్థాయిలో సెక్యూరిటీని కల్పిస్తున్నారు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. దీంతోపాటు బిగ్ బాస్ 18కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడకు వెళ్లినా భారీ బందోబస్తుతోనే సల్మాన్ ఖాన్ వెళుతున్నాడు.
ప్రత్యేక ఏర్పాట్లు చేయించాడు
ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తనకిచ్చిన మాట కోసం సల్మాన్ సింగం రిటర్న్స్ చిత్రంలో అతిథి పాత్ర పోషించినందుకు అజయ్ దేవగణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే సల్మాన్ రష్మికకకు ప్రత్యేక సెక్యూరిటీని ఏర్పాటు చేయించాడు. ముంబయిలో సికిందర్ సినిమా ఎన్నిరోజులు షూటింగ్ జరుపుకుంటే అన్ని రోజులు తన స్పెషల్ గెస్ట్ హౌస్ లో ఆమెను ప్రత్యేక అతిథిగా మర్యాదలు చేస్తున్నాడు. ఆమెకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, చిన్న ఇబ్బందులు రాకుండా, ఆమెకు భయం అనే పరిస్థితి రాకుండా ఏర్పాట్లు చేయించాడు.

రష్మికను కిడ్నాప్ చేసే అవకాశం ఉందని భావించి
తనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తుండటంతో తనతోపాటు రష్మిక కూడా హీరోయిన్ గా నటిస్తోంది కాబట్టి ఆమెకు కూడా బెదిరింపులు వచ్చే అవకాశముందని భావిస్తున్న సల్మాన్ ఖాన్ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ గ్యాంగ్ ఆమెను కిడ్నాప్ చేసి బెదిరించే అవకాశం ఉండటంతో ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నాడు. దీంతో రష్మిక చుట్టూ ఉన్న సెక్యూరిటీని చూసిన ఎందుకు ఆమెకు అంత సెక్యూరిటీని ఏర్పాటు చేశారు? ఏమైనా ప్రాణభయం ఉందా? ఎవరినుంచైనా ప్రాణహాని ఉందా? అని అభిమానులు ఆందోళన పడుతున్నారు. చివరకు అసలు విషయం తెలియడంతో సల్మాన్ ఖాన్ కు రష్మిక అభిమానులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సికిందర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే లక్ష్యంతో సల్మాన్ ఉన్నారు. మురుగదాస్ కూడా ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నాడు.












Click it and Unblock the Notifications