మోదీజీ.. వాళ్లను మీరు ఆపాలంటే..! సాయిరెడ్డి కీలక సలహా..!
నిత్యం ఏదో ఒక టాపిక్ పై ట్వీట్లు పెడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు, సలహాలు ఇచ్చే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇవాళ ఓ కీలక అంశంపై స్పందించారు. తాజాగా భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో (ISRO)కు చెందిన వందకు పైగా శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలో రాజీనామాలు చేయడం లేదా వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోతున్నారన్న వార్తలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. దీనిపై స్పందించిన కేంద్రం వారు రాజీనామాలు చేయకుండా నిబంధనలు కఠినతరం చేసింది.
దీనిపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఓ కీలక సూచన చేశారు. రాజీనామా నిబంధనల్ని కఠినతరం చేయడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తల్ని ఆపలేరని, ఇది సమస్యకు సరైన పరిష్కారం కాదని సాయిరెడ్డి తెలిపారు. అలాగే ఇస్రో శాస్త్రవేత్తల రాజీనామాలు ఆపాలంటే ఏం చేయాలో కూడా కేంద్ర ప్రభుత్వానికి సాయిరెడ్డి సూచించారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ వైరల్ అవుతోంది.

The news that over 100 #ISRO #scientists, including those associated with critical missions like #Gaganyaan, have resigned is concerning. Tightening rules for resignations is not the solution. We must address the root causes, better pay structures, performance-linked incentives,…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 18, 2026
గగన్‌యాన్ వంటి కీలక మిషన్లలో పాలుపంచుకున్న వారితో సహా 100 మందికి పైగా ISRO శాస్త్రవేత్తలు రాజీనామా చేశారన్న వార్త ఆందోళన కలిగిస్తోందని సాయిరెడ్డి తెలిపారు. రాజీనామాలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయడం దీనికి పరిష్కారం కాదన్నారు. మనం సమస్యకు గల మూల కారణాలను పరిష్కరించాలన్నారు. మెరుగైన వేతన విధానాలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు, బలమైన పరిశోధనా మద్దతు , శాస్త్రవేత్తలకు మరింత స్వయంప్రతిపత్తి కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ అంశాలపై తక్షణమే దృష్టి సారించాలని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ను ఆయన కోరారు.














Click it and Unblock the Notifications