ఆ హీరో ఇంట్లో దొరికిపోయిన రష్మిక..మ్యాటర్ అక్కడ వరకు వెళ్లిందా..?
గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికల మధ్య ఎఫైర్ నడుస్తుందనే రూమార్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్, రష్మిక ఒకరి తరువాత మరొకరు కనిపించడడం .. ఆ వెంటనే ఒకే మాల్దీవుల్లో రష్మిక ,విజయ్ వేర్వేరుగా దర్శనం ఇవ్వడంతో.. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే అభిప్రాయనికి వచ్చేశారు. ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదనివిజయ్ దేవరకొండ , రష్మిక క్లారిటీ ఇస్తునే ఉన్నారు. అయినప్పటికీ వీరిపై ఇలాంటి వార్తలు వస్తునే ఉన్నాయి.
ఆ మధ్య విజయ్ దేవరకొండ , రష్మిక ఇద్దరూ వేర్వేరుగా ఒకే ఇంట్లో ఉంటున్న ఫొటోలను తమ సోషల్ మీడియాల్లో పోస్టు చేశారు. విజయ్ దేవరకొండ ఒక ఫోటో దిగిన బ్యాక్‌గ్రౌండ్‌లోనే .. రష్మిక కూడా ఫొటో దిగింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పిట్టగోడ రెండూ సేమ్ టు సేమ్. దీంతో వీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నట్టు నిర్ధారించుకున్నారు. తాజాగా మరోసారి వీరిద్దరికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. రష్మిక దీపావళి సందర్భంగా తీసుకున్న ఫొటో షూట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఫొటోలకు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తీసినట్టు తెలుస్తోంది.

ఫొటో క్రెడిట్స్ ఇస్తూ థాంక్యూ ఆనందా అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ అమ్మడు విజయ్ ఇంట్లోనే దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. గతంలో కూడా ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా ఈవెంట్‌లో మాట్లాడుతూ.. మనం ఒకే ఫ్యామిలీ కదా అంటూ రష్మిక చెప్పడం జరిగింది. దీంతో విజయ్ దేవరకొండ, రష్మికల మధ్య డేటింగ్ వార్తలు నిజమే అని అంతా నమ్ముతున్నారు. తాజాగా దీపావళి నాడు మరోసారి వీరి మధ్య ఉన్న బంధం గురించి చర్చ జరుగుతోంది. కాబోయే అత్తగారి ఇంట్లో రష్మిక దీపావళి జరుపుకుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నేషనల్ క్రష్ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.












Click it and Unblock the Notifications