మాజీ సీపీ సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్: ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం!

తెలంగాణ రాజకీయాల్లో తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు నిర్వహించిన కాలంలో నమోదైన వివిధ కేసులు, వాటి దర్యాప్తు తీరుపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన పనితీరుపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఒక అధికారిక లేఖ రాశారు.

ఈ లేఖ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సజ్జనార్ తన పదవీకాలంలో తీసుకున్న నిర్ణయాలు, పలు పెండింగ్ కేసుల దర్యాప్తులో అవలంబించిన విధానాలు పారదర్శకంగా లేవని రాజాసింగ్ తన లేఖలో ఆరోపించారు. కొన్ని సున్నితమైన కేసుల విషయంలో దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగలేదని, దీనివల్ల నిజాలు వెలుగులోకి రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లు మరియు ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు.

MLA Raja Singh Demands CBI Probe Against Former Hyderabad CP VC Sajjanar in Letter to CM Revanth Reddy

ఈ నేపథ్యంలో, ఆ కాలంలో జరిగిన పరిణామాలపై పూర్తి స్థాయి స్వతంత్ర సంస్థతో లేదా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని ఆయన సీఎంను డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల స్థాయిలో పారదర్శకత లోపించడం వల్ల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సడలిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అయితేపోలీస్ శాఖలో సజ్జనార్‌కు ఎప్పుడూ హానెస్ట్ అధికారిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆర్టీసీ ఎండీగా ఆయన చేసిన సేవలు, ప్రజల సమస్యలపై ఆయన స్పందించిన తీరు ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. అయితే, నగర పోలీస్ కమిషనర్‌గా ఆయన తీసుకున్న కొన్ని పరిపాలనాపరమైన నిర్ణయాలు, శాంతిభద్రతల నిర్వహణ విషయంలో అప్పట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎదురుదెబ్బ!
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎదురుదెబ్బ!

రాజకీయ నాయకులు అధికార యంత్రాంగంపై బహిరంగంగా విమర్శలు గుప్పించడం, సీబీఐ విచారణ కోరడం వంటి పరిణామాలు రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా తెలంగాణా పోలీస్ శాఖలోనే ఒక విలక్షణ అధికారిగా పేరున్న సజ్జనార్ విషయంలో ఈ షాకింగ్ లేఖ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+