పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్..

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. చాలా ఏళ్లపాటు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఫిబ్రవరి 26న ఉదయపూర్‌ లో బంధువులు, స్నేహితుల మధ్య ఘనంగా వివాహం జరుపుకుంది. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ పూర్తయింది. ఇక వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అన్నదానం, స్వీట్ల పంపిణీ చేపట్టింది విజయ్ టీమ్.

ఇక ఇటీవల హనీమూన్ ట్రిప్ కు వెళ్లారు విజయ్, రష్మిక. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. థాయిలాండ్ లోని సామ్యూయ్ దీవిలో ఈ జంట ఎంజాయ్ చేసింది. అలాగే వీరి వెంట స్నేహితులు కూడా వెళ్లారు. బడ్డీమూన్ అనే పేరుతో ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు విజయ్, రష్మిక. అయితే తాజాగా రష్మిక మందన్న పెట్టిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

rashmika Mandanna Sparks Major Fan Frenzy With Viral We Have Become Three Post on Her Instagram

ఈ పోస్టులో రష్మిక.. ఇక నుంచి మేము ముగ్గురు అయ్యాం అని పేర్కొంది. ఈ మేరకు తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ గ్రాఫికల్ వీడియోను పోస్టు చేసింది. అందులో విజయ్, రష్మికతోపాటు ఓ పొద్దుతిరుగుడు పువ్వు కూడా ఉండటం విశేషం. మేం ముగ్గురం అయ్యాం అని రష్మిక క్యాప్షన్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. పెళ్లయిన నెలకే గుడ్ న్యూస్ చెప్పారంటూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు.

అయితే అసలు విషయం ఏంటంటే ఓ పొద్దు తిరుగుడు ఫ్లవర్ ను ఫస్ట్ నుంచి ఫ్రెండ్ గా భావిస్తోంది రష్మిక. ఈ మేరకు ఆ ఫ్లవర్ కు ఇన్ స్టా అకౌంట్ కూడా ఓపెన్ చేసింది. అప్పుడప్పుడూ ఆ ఫ్లవర్ తో పలు విషయాలు, వీడియోలను షేర్ చేసేది రష్మిక. అయితే ఇప్పుడు వీరికి విజయ్ జత కావడంతో ఇప్పుడు మేము ముగ్గురం అయ్యామని పోస్టు పెట్టింది రష్మిక. ప్రస్తుతం రష్మిక పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక విజయ్, రష్మిక ప్రస్తుతం రణబాలి అనే సినిమాలో నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+