సీఎం రేవంత్ దంపతులను కలిసిన నటి రష్మిక..
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా పెళ్లి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ వేదికగా ఇటీవల వీరి వివాహం సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక విజయ్- రష్మికల వివాహ రిసెప్షన్ ఈనెల 4న జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులను జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో నటి రష్మిక మందన్న కలిశారు. వివాహ రిసెప్షన్ కు ఆహ్వానించారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. ఫిబ్రవరి 26న ఉదయపూర్ లో వీరి వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నటి రష్మిక మందన్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులను కలిశారు. ఈ మేరకు రిసెప్షన్ కు ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సినీ నటుడు విజయ్ దేవరకొండతో ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన సినీ నటి రష్మిక కలిసి, తమ వివాహ రిసెప్షన్ కు ఆహ్వానించారు.#VijayDeverakonda#RashmikaMandanna#WeddingReception pic.twitter.com/6M84ipuadc
— Revanth Reddy (@revanth_anumula) March 1, 2026
మరోవైపు హైదరాబాద్ లో మార్చి 4న జరగనున్న తమ రిసెప్షన్ కు రావాలని విజయ్, రష్మికలు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధానికి ప్రత్యేక ఆహ్వానం అందించారు. ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా ఈ జంట కలిసింది. పెళ్లి రిసెప్షన్ కు రావాలని అహ్వానించారు.

ఇక ఉదయ్ పూర్ లో అతి కొద్దిమంది సమక్షంలోనే పెళ్లి చేసుకున్న ఈ జంట హైదరాబాద్ లో గ్రాండ్ రెసెప్షన్ పార్టీ ఏర్పాటు చేసింది. మార్చి 04న తాజ్ హోటల్ లో ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ కు చెందిన పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications