ఈ సినిమా కచ్చింతంగా ఫ్లాప్ : రవితేజ
మాస్ రాజా రవితేజ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన రవితేజ , ఆ తర్వాత క్యారెక్టర్ ఆరిస్టుగా మారి పలు సినిమాల్లో నటించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన 'నీకోసం' సినిమాతో హీరోగా అవతారం ఎత్తిన రవితేజ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా మారారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరో స్థాయికి రవితేజ ఎదిగారు.
గతంలో రవితేజ పలు హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు, తర్వాత ఆ హీరోలే రవితేజ సినిమాల్లో క్యారెక్టర్ ఆరిస్టులుగా నటించారు. అందరి హీరోల అభిమానులు రవితేజను అభిమానిస్తుంటారు. ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు రవితేజ గట్టి పోటీనిస్తున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం రవితేజకు అలవాటు. రవితేజ సినిమాల్లో తప్పిస్తే, బయట పెద్దగా కనిపించరు, మాట్లాడరు. రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు.

భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచియం అవుతోంది. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే చిత్ర యూనిట్ గట్టిగానే సినిమా ప్రమోషన్స్‌ను చేపట్టింది. ఈక్రమంలో హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేలను యాంకర్ సుమ ప్రత్యేకంగా ఇంటర్య్వూ చేశారు. ఈ సమయంలో రవితేజ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన సినిమా రిలీజ్ అయితే అది హిట్టా, ఫ్లాపా అని పట్టించుకుకొనని రవితేజ తెలిపారు. ఈ సందర్భంగా రవితేజ తాను జయాపజయాలని ఎలా తీసుకుంటారో వివరించారు.
మూవీ కోసం ఏం చేయాలో అంతా చేస్తాం.. ఒక సారి కంప్లీట్ అయ్యాక అది అనవసరమని రవితేజ చెప్పుకొచ్చారు. కొన్ని చిత్రాలు చేస్తున్నప్పుడు మధ్యలోనే అర్థం అయిపోతుంది.ఇది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని. కానీ సగం పూర్తయ్యాక ఏమి చేయలేమని రవితేజ అన్నారు. ఎక్కువగా నేను స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ కాను. నా వరకు కథ కోసం ఏమి మార్చుకోగలనో అని ఆలోచిస్తా. స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాత కథలో జోక్యం చేసుకోనని రవితేజ తెలిపారు.












Click it and Unblock the Notifications