'ఇరుముడి' తర్వాత రవితేజ ఊహించని సినిమా.. టైటిల్ ఇదే..
హిట్స్ ప్లాఫ్స్ అని సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ఫ్యాన్స్ ను అలరించే హీరోల్లో మాస్ మహారాజ రవితేజ ఒకరు. ఆయన ఇటీవల 'ఇరుముడి' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. గత రెండుమూడేళ్లుగా రవితేజకు సరైన హిట్ పడలేదు. అయితే ఈ ఏడాది వచ్చిన ఇరుముడి మూవీ రవితేజ కెరీర్ లో ఓ అద్భుతమనే చెప్పాలి. ఆగస్టు 21న రిలీజైన ఈ సినిమా రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి రవితేజ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచింది.
రవితేజ హీరోగా కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగానూ ఇరుముడి రికార్డు కొట్టింది. ఇక ఇరుముడి రవితేజ కమ్ బ్యాక్ మూవీ అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. థియేటర్లలో విజయవంతంగా ఆడిన ఇరుముడి మూవీ సెప్టెంబర్ 18 నుంచి ఓటీటీలోనూ స్ట్రీమింగ్ లోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇరుముడి ఇచ్చిన కిక్ తో రవితేజ ఫుల్ జోష్ లో ఉన్నారు. తాజాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ అయింది. ఇందుకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ కొద్దిసేపటి క్రితమే విడుదల అయింది. ఈ చిత్రానికి తులాభారం అనే క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేశారు. వివేక్ ఆత్రేయ- రవితేజ కాంబోలో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.
సరిపోదా శనివారం సక్సెస్ తో దర్శకుడు వివేక్ ఆత్రేయ రవితేజ కోసం బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీలో అనశ్వరా రాజన్, ప్రియాంకా మోహన్ ఫీమేల్ లీడ్స్ లో నటిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఇవాళ ఉదయం పూజా కార్యక్రమం జరిగింది. అనంతరం టైటిల్ డాక్యుమెంటరీ పేరుతో స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

తులాభారం మూవీలో నటిస్తున్న కీలక పాత్రలతో ఉన్న ఈ స్పెషల్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక ఈ మూవీలో రవితేజ క్రైమ్ మహారాజ్ గా కనిపించనున్నారు. ఇక ఈ క్రేజీ మూవీలో జేడీ చక్రవర్తి, తరుణ్ భాస్కర్, ప్రియాంకా మోహన్, అనశ్వరా రాజన్, అనిల్ కరెల్ల, రవి ఆంటోని, ఆయా పాత్రల్లో సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై లక్ష్మణ్, శ్రీని రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాదిలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
