19 ఏళ్లకే బ్రేకప్.. ఆస్పత్రి బెడ్‌పై ఉంటే పిచ్చిదానివి అన్నాడు: ఆర్జే మహవాష్

ప్రముఖ ఆర్జే, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ మహవాష్ ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత బాధాకరమైన చీకటి రోజులను పంచుకుంది. గతంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌తో డేటింగ్ పుకార్ల ద్వారా జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచిన ఆర్జే మహవాష్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన 19 ఏళ్ల వయసులో ఎదుర్కొన్న లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్, ఆ తర్వాత అనుభవించిన నరకప్రాయమైన మానసిక వేదన గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత తనను కాబోయే భర్త దారుణంగా మోసం చేశాడని.. ఆ నమ్మకద్రోహం భరించలేక తాను తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లిపోయానని చెబుతూ ఆర్జే మహవాష్ ఎమోషనల్ అయ్యింది.

ఒకే వ్యక్తి మూడు సార్లు ద్రోహం చేశాడు!
ఆర్జే మహవాష్ తన గతానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ.. తన మాజీ ప్రియుడు..మొదట ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడని తెలిపింది. అతను ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో మంచి పేరు, ప్రతిష్టలు ఉన్న వ్యక్తి అని.. అతనిని పెళ్లి చేసుకోవడం కోసం తాను తన సొంత కుటుంబంతో కూడా గొడవ పడ్డానని పేర్కొంది. "అప్పుడు నా వయసు కేవలం 19 ఏళ్లు. లోకం తెలియని వయసులో అతనిని ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించాను. నా జీవితంలో అతనికంటే మంచివాడు దొరకడు అనుకున్నాను. ఒకవేళ మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోతే, ఇల్లు వదిలి లేచిపోయి అయినా అతనినే పెళ్లి చేసుకుంటానని మా అమ్మానాన్నలతో మొండిగా చెప్పాను" అని ఆర్జే మహవాష్ ఆ రోజులను గుర్తుచేసుకుంది.

RJ Mahvash Breaks Down Opening Up About Her Painful Breakup Depression and Betrayal Details

అయితే పెళ్లికి అంతా సిద్ధమవుతున్న తరుణంలో.. అతను తనను ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు వేరే అమ్మాయిలతో మోసం చేశాడని తెలిసినప్పుడు తన ప్రపంచం ముక్కలైపోయిందని ఆర్జే మహవాష్ పేర్కొంది. మొదట్లో అతనిపై ఉన్న ప్రేమతో ప్రతిసారీ క్షమిస్తూ వచ్చినప్పటికీ.. మోసం చేయడం అతనికి ఒక అలవాటుగా మారిపోయిందని.. అది ఎప్పటికీ మారదని గ్రహించిన తర్వాతే గుండె రాయి చేసుకుని నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ఆమె చెప్పింది.

వింత భ్రమలతో మానసిక నరకం!
నమ్మక ద్రోహం, లవ్ ఫెయిల్యూర్ కారణంగా తాను తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యానని.. పానిక్ అటాక్స్ రావడం వల్ల ఆస్పత్రి పాలై భారీగా మందులు వాడాల్సి వచ్చిందని ఆర్జే మహవాష్ వివరించింది. ఆ రోజుల్లో తను అనుభవించిన నరకాన్ని ఆర్జే మహవాష్ వివరిస్తూ.. "నేను మానసిక ప్రశాంతత కోసం ఎంత ఎక్కువ డోస్ ఉన్న ఇంజెక్షన్లు, టాబ్లెట్లు వేసుకునేదాన్ని అంటే.. నా చుట్టూ ఏదో జరుగుతున్నట్లు వింత భ్రమలు కలిగేవి. నా గదిలో ఎవరూ లేకపోయినా.. ఎవరో నడుచుకుంటూ నా వైపు వస్తున్నట్లు, నన్ను చంపడానికి వస్తున్నట్లు అనిపించేది. ఆ మందుల ప్రభావం నా శరీరంపై, మనసుపై చాలా తీవ్రంగా పడింది" అంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది.

ఆస్పత్రి బెడ్ పై ఉంటే పిచ్చిదానివి అని అన్నాడు..!
ఆ కష్ట సమయంలో కూడా తన మనసు విరిచేసిన ఆ వ్యక్తే మళ్లీ తనను బాగు చేయగలడని అమాయకం నమ్మానని ఆర్జే మహవాష్ చెప్పింది. అందుకే తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు అతనికి ఫోన్ చేసి, తాను ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని చెబితే.. అతను కనీసం చూడటానికి కూడా రాలేదని వెల్లడించింది. పైగా ఫోన్లోనే అత్యంత క్రూరంగా మాట్లాడుతూ.. "నువ్వొక పిచ్చిదానివి. నువ్వు మెంటల్ పేషెంట్‌వని, సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నావని మా ఇంట్లో తెలిస్తే నా పరిస్థితి ఏంటి? నా పరువు ఏం కావాలి?" అంటూ దారుణంగా అవమానించాడని ఆర్జే మహవాష్ గుర్తుచేసుకుంది.

గర్భవతి అయిన భార్యను కూడా మోసంచేశాడు..!
అలీగఢ్ నగరంలో ఉంటే అతని జ్ఞాపకాలు వెంటాడుతుండటంతో ఆ ఊరు వదిలిపెట్టి వేరే ప్రాంతానికి రావడం వల్లే తాను ఆ మానసిక నరకం నుంచి నెమ్మదిగా కోలుకోగలిగానని ఆర్జే మహవాష్ తెలిపింది. అయితే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఆ రోజే ఆ పెళ్లి క్యాన్సిల్ అవ్వడం తన జీవితానికి దేవుడు చేసిన అతిపెద్ద మేలు అని ఆమె భావిస్తోంది. "ప్రస్తుతం ఆ వ్యక్తికి భార్యతో విడాకులు అయిపోయాయి. అతను పెళ్లి చేసుకున్న తర్వాత తన గర్భవతి అయిన భార్యను కూడా దారుణంగా మోసం చేశాడు. దాంతో ఆమె అతనికి విడాకులు ఇచ్చేసింది. దీన్నిబట్టి మోసం చేయడం అనేది అతని రక్తంలోనే ఉందని, అతను ఎప్పటికీ మారడని అర్థమైంది. ఆరోజు నేను అతని నైజాన్ని నమ్మి పెళ్లి చేసుకుని ఉంటే నా జీవితం నాశనమైపోయేది. దేవుడి దయ వల్ల నేను చాలా పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాను" అని ఆర్జే మహవాష్ సంచలన నిజాలను వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+