Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆయన గోల్డెన్ హ్యాండ్ వల్ల ఈ స్థాయికి వచ్చా : ఆర్కే రోజా

ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా 50 ఏళ్ల సంగీత ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఇళయరాజాను కలిశారు. భర్త సెల్వమణి, కుమారుడు కృష్ణ కౌషిక్ తో కలిసి ఇళయరాజా ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. తన తొలి సినిమాకు ఇళయరాజానే సంగీతం అందించినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. ఇళయరాజా గోల్డెన్‌ హ్యాండ్ వల్లే తాము ఇంతగా ఎదిగామని ఆమె సంతోషం‌ వ్యక్తం చేశారు.

భారతీయ సంగీత సెన్సేషన్, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీత ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా తన కుటుంబంతో కలిసి ఇళయరాజా ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. తన తొలి సినిమాకు కూడా ఇళయరాజానే సంగీతం సమకూర్చారని అలాగే ఆర్కే సెల్వమణి తొలి మూడు సినిమాలకూ సంగీతాన్ని అందించినట్లు గుర్తుచేసుకున్నారు. ఇళయరాజా గోల్డెన్‌ హ్యాండ్ వల్లే తాము ఇంతగా ఎదిగామని ఆమె సంతోషం‌ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోజూ కుమారుడు కృష్ణ కౌశిక్ ను ఇళయరాజా ఆశీర్వదించారు. "మీలాగే మీ కుమారుడు కూడా సినీ రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడని.." ఆశీర్వదించారు.

ఇక ఇళయరాజా సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఈనెల 13న నెహ్రూ స్టేడియంలో భారీ ఎత్తున గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ను నిర్వహించారు. రాయల్ అకాడమీ ఆధ్వర్యంలో లండన్ నుంచి వచ్చిన 87మంది సంగీత దర్శకులతో అతిపెద్ద సింఫోనీ కార్యక్రమంతో అఖండ సత్కారం జరిపారు.

ఈ సమావేశానికి తమిళనాడు సీఎం‌ MK స్టాలిన్ తో బాటు, సినీ దిగ్గజాలు రజనీకాంత్, కమలహాసన్ లతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై సన్మానించారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా దర్శక దిగ్గజం‌ ఆర్కే సెల్వమణి హాజరయ్యారు. తాను దర్శకత్వం వహించిన తొలి మూడు చిత్రాలకూ ఇళయరాజా గారే సంగీతం సమకూర్చారని, ఆ మూడూ సూపర్ హిట్ అయ్యిందని అన్నారు.

RK Roja Felicitates Ilayaraja for 50 Glorious Years in Music

ఇళయరాజా సినీ సంగీత ప్రపంచంలో 50ఏండ్లుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటివరకూ 1,500 పైగా సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, 8,500 పైగా పాటలకు సంగీతాన్ని అందించారు. సినిమా సంగీతంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ దిగ్గజానికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా ప్రతిపాదించనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు.

1943లో తమిళనాడులోని పన్నైపురంలో ఇళయరాజా జన్మించారు. ఆయన అసలు పేరు జ్ఞానదేశికన్. బాల్యంలోనే జానపద గీతాలు, గ్రామీణ నాటకాలపై ఆసక్తి పెంచుకున్నారు. అలా 1976లో అన్నకిళి అనే సినిమాతో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేశారు. రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో సింఫనీ రికార్డ్ చేసిన తొలి ఆసియా సంగీత దర్శకుడు ఇళయరాజా కావడం విశేషం. ఇళయరాజా ఇప్పటివరకు 5 జాతీయ అవార్డులు అందుకున్నారు. 2010లో పద్మ భూషణ్, 2018లో పద్మ విభూషణ్ పురస్కారాలు ద‌క్కించుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+