ఎస్ జే సూర్యను కొట్టిన పవన్ కల్యాణ్..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారాయన. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికి ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా 'ఖుషి' సినిమాతో పవన్ కల్యాణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
పవన్ కల్యాణ్ కెరీర్‌తో బ్లాక్ బాస్టర్ హిట్‌గా 'ఖుషి' సినిమా నిలిచింది. అంతేకాకుండా అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ 'ఖుషి' బ్రేక్ చేసింది. ఈ సినిమాతో పవన్ కల్యాణ్ మరోసారి ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేశారు. ఈ సినిమా పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఖుషి సినిమాకు సపరేటు ఫ్యాన్ బేస్ ఉందంటే ఆ సినిమా ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత పవన్ కల్యాణ్‌కు పదేళ్లపాటు హిట్లు లేవంటే ఈ సినిమా ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇటీవల పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమానే అభిమానులు రీ-రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో భూమిక హీరోయిన్‌గా నటించగా, ఎస్.జే సూర్య దర్శకత్వం వహించారు. ఖుషి తర్వాత ఎస్.జే సూర్య పవన్ కల్యాణ్‌తో 'కొమురం పులి' సినిమా చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎస్ జే సూర్యను పవన్ కల్యాణ్ కొట్టారనే రూమర్స్ వినిపించాయి. ఓ రోజు పవన్ కల్యాణ్ షూటింగ్‌కు వచ్చే సరికి, ఒకరి మీద ఎస్ జే సూర్య బండ బూతులు తిడుతూ కనిపించారు. దీంతో కోపం వచ్చిన పవన్ కల్యాణ్ ఆయన మీద చేయి చేసుకున్నారనే ప్రచారం జరిగింది.
ఈ ఘటన తర్వాత వీరిద్దరు కొన్ని రోజులు మాట్లాడుకోలేదని, అందుకే ఆ సినిమా సరిగా రాలేదనే విమర్శలు సైతం అప్పట్లో వినిపించాయి. అయితే అదింతా కూడా కేవలం ప్రచారమే అని తేలింది. ఎస్ జే సూర్య నటుడుగా మారి సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్‌తో ఖుషి-2 చేయడానికి ఆయన దగ్గరకు వెళ్తే..ఇప్పుడు ప్రేమకథలు చేస్తే బాగోదని ఎస్ జే సూర్య తెలిపారు. ఇదే సమయంలో పవన్ తన స్నేహితుడని ఎస్ జే సూర్య కామెంట్ చేశారు. దీంతో పవన్ కల్యాణ్ ఆయన్ను కొట్టడం అంతా ప్రచారమే అని తేలిపోయింది.












Click it and Unblock the Notifications