మొత్తానికి హీరోయిన్‌తో పెళ్లిపై ఓపెనైనా మెగా హీరో
గత కొద్ది రోజులుగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెళ్లికి సంబంధించిన వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.సాయి ధరమ్ తేజ్ ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ మెహరీన్ ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటున్నారనే రూమర్ వైరల్ అవుతోంది. 'జవాన్'మూవీలో వీరిద్దరు కలిసి నటించారు. షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో , వీరు తమ రిలేషన్‌ను పెళ్లిగా మార్చాలని భావిస్తున్నారని, వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా తన పెళ్లిపై మెగా హీరో క్లారిటీ ఇచ్చారు.
'ఉషా పరిణయం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సాయి ధరమ్ తేజ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా సదరు యాంకర్ సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి ఆయన్ను ప్రశ్నించింది. 'నాకు వన్‌సైడ్ లవ్ ఉంది. కానీ అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఒకవేళ నాకు ఎవరైనా అమ్మాయి నచ్చి మాట్లాడేలోపు.. అదేంటీ మీకు పెళ్లి అయిపోయిందంట కదా? అని నన్ను ప్రశ్నిస్తున్నారు. నాకు పెళ్లా? అని నేను ఆశ్చర్యపోతున్నాను. మీడియా వస్తోన్న వార్తలను చూశామంటూ సమాధానం ఇస్తున్నారు' అంటూ నవ్వుకుంటూ ఆన్సర్ ఇచ్చాడు మెగా హీరో. సోషల్ మీడియాలో తన పెళ్లి వస్తున్న వార్తల్లో నిజం లేదని సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చినట్టు అయింది.

గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ పలువురు హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నారని వార్తలొచ్చాయి. హీరోయిన్ రెజీనాతో సాయి ధరమ్ తేజ్ వరుసగా రెండు సినిమాలు చేయడంతో, ఆమెతో మెగా హీరో రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఇదే సమయంలో వీరిద్దరు బయట పబ్‌ల్లో కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదింతా నిజమే అనుకున్నారు. కానీ తాము కేవలంస్నేహితులమంటూ వీరు క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ 'తిక్క' సినిమా హీరోయిన్ లారిస్సా బోనేసిను గాఢంగా ప్రేమించారు. అయితే సాయి ధరమ్ తేజ్ ప్రేమను ఆమె తిరస్కరించింది. ఈ విషయాన్ని సాయి ధరమ్ తేజ్ స్వయంగా బయటపెట్టడం జరిగింది. ఇప్పుడు హీరోయిన్ మెహరీన్‌తో సాయి ధరమ్ తేజ్ పెళ్లంటూ ప్రచారం జరిగింది. అలాంటిది ఏమి లేదని సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications