అతనంటే పిచ్చి 10 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నా : సాయి పల్లవి
తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసిందనే చెప్పాలి. ఇక సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తన తొలి తెలుగు సినిమా ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాటపర్వం వరకు అన్ని విభిన్నిమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది.
తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. రొమాంటిక్ , ముద్దు సీన్లకు సాయి పల్లవి దూరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే సాయి పల్లవి తాజాగా మహాభారతం గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

మహాభారతం అంటే తనకు చాలా గౌరవమని తెలిపిన సాయి పల్లవి, అర్జునుడి కొడుకు అభిమన్యుడు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. గడిచిన 10 ఏళ్లుగా అభిమన్యుడు క్యారెక్టర్ గురించి చాలా తెలుసుకున్నానని, అతనితో 10 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నా అంటూ సాయి పల్లవి తెలిపింది. ప్రస్తుతం సాయి పల్లవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక సాయి పల్లవి కెరీర్ విషయానికి వస్తే నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్‌లో వస్తోన్న తాండెల్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణం' ప్రాజెక్ట్‌లో సీత పాత్రలో సాయి పల్లవిని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ఏడాది సాయి పల్లవి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జపాన్‌లో శరవేగంగా జరుగుతుంది.












Click it and Unblock the Notifications