సల్మాన్‌ఖాన్, ఎన్‌టిఆర్ ఒకే స్ర్కీన్‌పై... ఇక అభిమానులకు పండగే..
సౌత్ సూపర్ స్టార్ జూనియర్ ఎన్‌టిఆర్ RRR తర్వాత ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అందుకే ఇప్పుడు ఎన్‌టిఆర్‌కు బాలీవుడ్ నుంచి ఆఫర్లు తెగ వచ్చేస్తున్నాయి. అయితే, జూనియర్ ఎన్‌టిఆర్ 'వార్ 2'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.
సౌత్ ఇండియాలో ఎన్‌టిఆర్‌కి ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని వార్ 2 మేకర్స్ నటుడికి ఒక పాత్రను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు తాజాగా ఎన్‌టిఆర్, సల్మాన్‌ఖాన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్, సౌత్ స్టార్ జూనియర్ ఎన్‌టిఆర్ స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నారనే వార్త అభిమానులను తెగ కలవరపెడుతోంది.

వార్ 2 తో బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్న ఎన్‌టిఆర్ అంతకంటే ముందే సల్మాన్ ఖాన్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నాడట. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న టైగర్ 3 సినిమా దీవపాళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా క్లైమాక్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందనే బీటౌన్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాకి కొనసాగింపుగా వార్ 2 ఉంటుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్, లేదా జనవరి నుండి ఉండొచ్చని అంటున్నాయి సినీవర్గాలు.

2025లో వార్ 2 సినిమా: ప్రస్తుతం ఎన్‌టిఆర్ దేవర చిత్రీకరణలో బిజిగా ఉన్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి జాన్వీకపూర్ ఎన్‌టిఆర్ సరసన నటిస్తున్నారు. అయితే, దేవర సినిమా పూర్తిచేసిన తర్వాత ఎన్‌టిఆర్ వార్2 చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. అయితే వార్ 2లో హృతిక్ రోషన్‌తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్నారని ఇప్పటికే బాలీవుడ్ వర్గాలు ఖరారు చేశాయి. 2025లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'బ్రహ్మాస్త్ర'కు దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీనే వార్ 2 డైరెక్ట్ చేయబోతున్నారు.

రామ్‌చరణ్ స్పెషల్ అప్పియరెన్స్: ఇంతకుముందు, సల్మాన్ ఖాన్ నటించిన 'కిసీ కి భాయ్ కిసీ కి జాన్' చిత్రంలో సల్మాన్ దక్షిణాది అవతార్‌లో కనిపించారు. ఆ సినిమాలోని ఓ పాటలో రామ్ చరణ్ స్పెషల్ అప్పియరెన్స్ కూడా చూశాం. అయితే, ఇప్పుడు జూనియర్ ఎన్‌టిఆర్ తో సల్మాన్ ఖాన్ స్ర్కీన్ షేర్‌తో దక్షిణాది ప్రేక్షకులను కూడా ఈ సినిమావైపు మళ్ళించేలా చేస్తోంది.
సల్మాన్ ఖాన్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. టైగర్ 3 నవంబర్ 10 న దీపావళి సందర్భంగా విడుదల కానుంది. భాయ్‌జాన్ అభిమానులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications