‘సికిందర్’ థియేటర్ల గోడలు బద్దలు కొట్టి బయటపడుతున్న జనాలు
సల్మాన్ ఖాన్, రష్మిక జంటగా నటించగా, రంజాన్ పండగ సందర్భంగా విడుదలైన 'సికిందర్' సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్ల గోడలు బద్దలు కొట్టుకొని మరీ బయటపడుతున్నారు. ప్రతి సంవత్సరం రంజాన్ పండగను పురస్కరించుకొని సినిమాను విడుదల చేయడం సల్మాన్ ఖాన్ ఆనవాయితీ. దక్షిణాది దర్శకుల హవా కొనసాగుతుండటంతో ఈసారి మురుగదాస్ ను ఎన్నుకున్నాడు. తెలుగు సినీ దర్శకులెవరూ ఖాళీ లేకపోవడంతోనే అతను మురుగదాస్ ను ఎంచుకున్నాడుకానీ గతంలో ఉన్నంత ఫాంలో లేడు అనే విషయాన్ని మాత్రం సల్మాన్ ఖాన్ మర్చిపోయినట్లున్నాడు. దానికి ఇప్పుడు మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
ఒక్క సన్నివేశం కూడా లేదు
ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వడం కూడా అనవసరమనే భావనలో సినీ విశ్లేషకులు, విమర్శకులు ఉన్నారు. అసలు ఏ కాలంలో ఉన్నాం.. ఏ కాలపు కథతో సినిమా తీశాడురా బాబూ అంటూ తలలను బద్దలు కొట్టుకుంటున్నారు. ఆర్య, త్రిష, జేడి చక్రవర్తి నటించిన 'సర్వం' సినిమా కచ్చితంగా గుర్తుకొస్తుంది. సొంతంగా ఓ కథ రాసుకొని నిజాయితీగా తీసివుంటే కనీసంలో కనీసమైనా ఫలితం ఉండేది. ఇక్కడ అది కూడా దక్కలేదు. విమానంలో హీరో మంత్రి కొడుకును కొట్టడంతో సినిమా ప్రారంభమవుతుంది. ఈ సన్నివేశంతోపాటు ఆ తర్వాత వచ్చిన సన్నివేశాలు చూసిన తర్వాత సినిమాకు వెళ్లినవారు కుర్చీలను బద్దలు కొట్టి, థియేటర్ గోడలను బద్దలు కొట్టుకొని మరీ బయటపడేంత దారుణంగా ఉన్నాయి.

ఎందుకు ఒప్పుకున్నార్రా బాబూ..
సల్మాన్ ఖాన్, రష్మిక జంట ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. వారి మధ్య కెమిస్ట్రీ అస్సలు లేదు. అసలు ఇది సల్మాన్ సినిమానేనా? మురుగదాస్ తీశాడా? అంటూ లక్ష సందేహాలు వచ్చాయి. కనీసం సినిమా మొత్తంమీద ఒక్క సన్నివేశం కూడా సూపర్ అనిపించేలా ఏమాత్రం లేదు అంటే సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రష్మిక ఈ సినిమాను ఎందుకు ఒప్పుకుందో ఆమెకే తెలియాలి. మంచి మంచి నటులు సినిమాలో ఉన్నారు. వారి పాత్రలు చూసిన తర్వాత అసలు వీటిని ఎలా ఒప్పుకున్నార్రా బాబూ అనిపిస్తుంది. టైగర్ జిందాపై సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ కు ఒక్క హిట్ కూడా లేదు.












Click it and Unblock the Notifications