మొత్తానికి ప్రియుడు గుట్టు విప్పిన సమంత.. అలా జరిగిపోయిందంటూ కామెంట్
హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు.
పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు. సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు. నాగ చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు.ఈక్రమంలోనే సైలెంట్‌తో శోభితతో గురువారం నిశ్చితార్ధం చేసుకున్నాడు. అతి కొద్దిమంది సమక్షంలో వీరి నిశ్చితార్ధ కార్యక్రమం జరిగింది. మరోవైపు సమంత మాత్రం సింగిల్‌గానే ఉంటూ వస్తున్నారు.

ఇక గతంలో సమంత హీరో సిద్దార్థ్‌తో రిలేషన్ మెయిన్‌టైన్ చేసింది. వీరిద్దరు ప్రత్యేకంగా గుడిలో పూజలు కూడా నిర్వహించారు. ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత సమంత , నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని , విడాకులు తీసుకున్నారు. అయితే సమంత టీనేజ్‌లో ఉన్న సమయంలోనే ఓ వ్యక్తిని ఇష్టపడ్డారట. ఈ విషయాన్ని సమంతనే ఓ ఇంటర్య్వూలో చెప్పడం జరిగింది.
స్కూల్లో చదువుకునే రోజుల్లో, ఒక అబ్బాయి సమంతను రెండేళ్లు ఫాలో అయ్యేవాడట. అయితే ఒక్కరోజు కూడా మాట్లాడలేదట. ఒకరోజు ఎందుకు తనని ఫాలో అవుతున్నావని సమంత అడిగితే, ఆ అబ్బాయి 'నేను నిన్ను ఫాలో అవుతున్నానని ఎవరు చెప్పారని సమంతను ఎదురు ప్రశ్నించాడట. అతని మాటలకు సమంత చాలా బాధపడిందట. ఆ అబ్బాయి తనను ప్రేమిస్తున్నాడో లేదో అర్థం కాలేదట. ఆ అనుభవం విచిత్రంగా అనిపించినా, అదొక మధుర జ్ఞాపకంగా మిగిలిందని సమంత చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications