అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన సమంత...వచ్చే ఏడాది నుంచి షూటింగ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ సినిమాల్లో నటించనుంది. తీవ్ర అనారోగ్యం కారణంగా సామ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నవిషయం తెలిసిందే. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే ఆ భాదలోంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వ్యాధి కోసం గత కొంతకాలంగా రకరకాల ప్రకృతి చికిత్సలు కూడా తీసుకుంది. ఇదిలా ఉండగా, సమంత తన అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ మళ్లీ తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి నేను షూటింగ్‌లో పాల్గోనబోతున్నాను. అందుకోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆ సినిమాలోని నా పాత్ర కోసం నేను ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నా. ఇక, ఈ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్, అర్చరీ వంటివి నేర్చుకునే పనిలో ఉన్నా. అందుకోసం నేను చాలానే నేర్చకుంటున్నా.. నేను చిత్ర పరిశ్రమకి వచ్చి ఇప్పటికీ పదిహేనేళ్లు అవుతుంది. ఈ పదిహేను సంవత్సరాల్లో నేను చాలా చూశాను. ఇంకా నేను చాలా నేర్చుకోవాల్సి ఉంది. అయితే మళ్లీ నేను కొత్తగా సెట్‌లోకి అడుగపెట్టబోతున్నా.. ఓ విద్యార్థి మాదిరిగానే మళ్లీ కెమెరా ముందుకు రావాలి అనుకుంటున్నా అంటూ సామ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సొంత ప్రొడక్షన్‌లోనే సినిమా..
ఇకపోతే సమంత సినిమాల గురించి చూస్తే... గత సంవత్సరం టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరో చిత్రంలో కనిపించలేదు. ప్రస్తుతం సామ్ సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత మలయాళంలో మమ్ముట్టితో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇక, ఈ చిత్రానికి గౌతమ్ వాస్‌దేవ్ మీనన్ దర్శకత్వం వహించబోతున్నారట. తెలుగులో 'మా ఇంటి బంగారం' సినిమాను తాజాగా అనౌన్స్ చేసింది. తన సొంత ప్రొడక్షన్లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications