అక్షరాలా రూ.1200 కోట్లు పోగొట్టుకున్న సమంత?
దక్షిణాది బ్యూటీ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. ఆమె వార్త లేకుండా సోషల్ మీడియా ఉండదు. సోషల్ మీడియాలో వార్త లేకుండా ఆమె ఉండలేదు. అంతగా నెటిజన్లు సమంత వార్తల గురించి శోధిస్తుంటారు. క్రేజ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. నాగచైతన్యకు విడాకులిచ్చిన తర్వాత మయోసైటిస్ సోకడంతో సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర వరకు సినిమాలు చేయలేదు. అంతకుముందు తాను నిర్మాతల దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్స్ ను కూడా తిరిగిచ్చేసింది. కేవలం ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసమే వీటిని వదులుకుంది.
రూ.20 కోట్ల పారితోషికం
మయోసైటిస్ సోకకముందే బాలీవుడ్ లో అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమా చేయడానికి అంగీకారం తెలిపింది. దీనికి రూ.20 కోట్ల పారితోషికం ఇస్తానన్నారు. బాలీవుడ్ లో సమంతకే పాపులారిటీ ఎక్కువ. బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ విడుదల చేసే టాప్ హీరోయిన్ల జాబితాలో కూడా ఎప్పుడూ మొదటిస్థానంలోనే సమంత నిలుస్తుంది. అట్లీకి కూడా సమంత అంటే సెంటిమెంట్. అయితే మయోసైటిస్ తీవ్రమవడంతో చికిత్స తీసుకునేందుకు ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో రూ.12 కోట్ల పారితోషికం ఇచ్చి నయనతారను తీసుకున్నారు. ఈ సినిమా బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించి సంచలన విజయాన్ని సాధించింది.

రూ.1200 కోట్లు వసూలు చేసిన జవాన్
జవాన్ సినిమా రూ.1200 కోట్లు వసూలు చేసింది. సమంత ఈ సినిమా చేయకపోవడంవల్ల అక్షరాలా రూ.1200 కోట్లువ సూలు చేసిన సినిమా రికార్డులో భాగమయ్యే అవకాశాన్ని కోల్పోయినందని ఆమె అభిమానులు చెబుతున్నారు. బాలీవుడ్ లోనే త్వరలోనే సల్మాన్ ఖాన్ తో కలిసి ఓ సినిమా చేయబోతోంది. సుకుమార్-రామ్ చరణ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా సమంత కథానాయికగా ఎంపికైంది.

ప్రస్తుతం మాఇంటి బంగారం పేరుతో సొంత బ్యానరులో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. ఇటీవల అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో తనకు సినిమాల్లో అవకాశాలు రావడంలేదని బహిరంగంగానే హోస్ట్ రానాతో చెప్పింది. త్వరలోనే ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ఒప్పుకుంది. తాజాగా విడులైన హనీబన్నీ వెబ్ సిరీస్ హిట్ టాక్ తో అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతోంది.












Click it and Unblock the Notifications