అతనితో రెండో పెళ్లికి సమంత గ్రీన్ సిగ్నల్..జీవితాంతం నా చెయ్యి పట్టుకొనే..

గత కొద్ది రోజులుగా హీరోయిన్ సమంత రెండో పెళ్లి గురించి విపరీతమైన ప్రచారం జరుగుతోంది.అక్కినేని నాగ చైతన్య సమంత ప్రేమ వివాహం చేసుకున్నారు.2017లో వీరి వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్యను శోభితను రెండో వివాహం చేసుకున్నారు.సమంత మాత్రం సింగిల్‌గానే ఉంటున్నారు.

నాగ చైతన్యతో విడాకులు తర్వాత సమంత తెలుగు సినిమాలు చేయడం కూడా తగ్గించేశారు.ఆమె బాలీవుడ్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఇదిలా ఉంటే సమంతకు రెండో పెళ్లికి సంబంధించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ సమంత మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోను అని మాత్రం ఎక్కడా కూడా చెప్పడం లేదు. సమంత రెండో పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట సంచలనంగా మారింది. గత కొంతకాలంగా సమంత బాలీవుడ్‌ దర్శకుడు రాజు నిడుమోరుతో డేటింగ్ చేస్తోన్నట్టు ప్రచారం జరుగుతోంది.వీరిద్దరు చాలాకాలంగా ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

Samantha shares interesting post her social media

సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. సమంత ఇటీవల నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

సరిగ్గా ఇదే సమయంలో సమంత రాజు నిడుమోరుతో కలిసి కనిపించారు.రాజు నిడుమోరుతో చేతిలో చేయి వేసుకుని అమ్మడు దర్శనం ఇచ్చింది. దీంతో ఈ జంట పెళ్లి చేసుకోవడం ఫిక్స్ అని అంతా భావిస్తున్నారు.తాజాగా సమంత చేసిన పోస్ట్ కూడా ఈ వార్తలకు బలం చేకూరినట్టు అయింది.నిన్ను ప్రేమించాలంటే భయమేస్తోంది, జీవితాంతం నా చెయ్యి పట్టుకొనే ఉంటావా..? అనే అర్థం వచ్చేలా సమంత ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. అయితే ఈ ప్రచారంపై సమంతతో పాటు, అటు రాజు నిడుమోరు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+