డీఆర్డీఏ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు.. రూ.39 లక్షలకు పైగా లంచం వసూలు చేస్తూ..

తెలంగాణలో ఏసీబీ అధికారుల దాడులు ఉదృతం అవుతున్నాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గ్రామీణాభివృద్ధి సంస్థలో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఓ కాంట్రాక్టర్ నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై ప్రాజెక్టు అధికారి సతీష్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ రాజును అదుపులోకి తీసుకున్నారు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పనుల్లో భాగంగా రూ. 39 లక్షల 14 వేల రూపాయల బదిలీ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదు మేరకు 2026 అక్టోబర్ 22 న తనిఖీలు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

విచారణలో అధికారులు సతీష్ రెడ్డి, రాజు కలిసి కాంట్రాక్టర్ నుంచి యూపీఐ ఐడీల ద్వారా రూ. 39.17 లక్షల రూపాయలను ఆన్ లైన్ ద్వారా బదిలీ చేయించుకున్నట్లు తేలింది. అలాగే ఈ లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్ మెంట్స్, వాట్సాప్ చాట్ రికార్డులను కూడా కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు అందించాడు. ఈ నగదుతో పాటు పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి మరో 25 శాతం ఇవ్వాలని సతీష్ రెడ్డి డిమాండ్ చేసినట్టు తేలింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు సతీష్ రెడ్డి, రాజులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన విషయాలను ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు. తదుపరి చర్యల్లో భాగంగా నిందితులను వరంగల్ లోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు స్పష్టం చేశారు.

ACB raids at DRDA office latest news officials caught in connection with a Rs 40 lakh transfer deal

ఇదిలాఉంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ఉద్యోగి అయినా లంచం కోసం వేధిస్తే భయపడకుండా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇందుకోసం 1064 టోల్‌ ఫ్రీ నంబర్‌ కు కాల్ చేసి సమాచారం అందించాలని పేర్కొన్నారు. లంచం డిమాండ్ చేసినట్లు ఎదురైతే సంబంధిత వివరాలతో ఏసీబీని సంప్రదించాలని పలు సూచనలు చేశారు. వ్యక్తిగత గోప్యత, భద్రత దృష్ట్యా ఫిర్యాదు దారుడి పేరు, ఇతర వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఇక ఇటీవలికాలంలో తెలంగాణలో అధిక సంఖ్యలో ఉద్యోగులు.. ఏసీబీ అధికారుల చేతికి చిక్కుతున్న సంగతి తెలిసిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+