టిబెట్ లో భారీ భూకంపం.. 7.1 తీవ్రతతో ప్రకంపనలు.. వరదలు మరువకముందే..

చైనాలోని టిబెట్ ప్రాంతంలో గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల 33 నిమిషాల సమయంలో నార్తన్ టిబెట్ లోని నాగ్కు అనే ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు ది చైనా ఎర్త్ క్వేక్ నెట్ వర్క్స్ సెంటర్ ధృవీకరించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1 గా నమోదైనట్లు తెలిపింది.

భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు పేర్కొంది. అలాగే భూకంప కేంద్రం చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో సగటు ఎత్తు సుమారు 4,864 మీటర్లుగా ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. భూకంప కేంద్రం టిబెట్ రాజధాని లాసా నుండి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వెల్లడించింది.


ఈ ఏడాది ఆగస్టు 26న నేపాల్- చైనా బోర్డర్ లో భీకర వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఇళ్లు, రోడ్లు, బ్రిడ్జ్ లు, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అంతేకాక వేలాదిమంది గల్లంతయ్యారు. ఈ అకాల వరదల ధాటికి 1400ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా నేపాల్ లోని 8 జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

చితావన్ జిల్లా నుంచి 348 మంది మృత దేహాలను వెలికి తీయగా.. నవాల్ పరాసీ జిల్లా నుంచి 218 మృత దేహాలను బయటకు తీశారు. అలాగే 155 మృతదేహాలు నూవాకోట్ నుంచి లభ్యం అయ్యాయి. వీటితోపాటు రసువా జిల్లాలో 127 మృతదేహాలు లభ్యం కాగా.. ఘోర్కా జిల్లాలో 69 మృతదేహాలు లభ్యం అయ్యాయి. దాడింగ్ నుంచి 60 మృత దేహాలు.. తనాహు నుంచి 38 మృతదేహాలను వెలికి తీసినట్లు నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్ మెంట్ అథారిటీ వెల్లడించింది.

Tibet Earthquake 2026 Massive earthquake in Tibet tremors measure 7 1 in magnitude Earthquake news

ఈ ఘటన జరిగిన కొన్ని వారాల్లోనే ఇప్పుడు భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ భూకంపం ధాటికి జనాలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఏమైనా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లిందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+