'బెడ్ రూమ్ లో నా భర్త చేసేది ఇదీ'.. రాజ్ నిడిమోరుపై సమంత వైరల్ పోస్ట్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం సినిమాలు తగ్గించినా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. 2010 లో ఏమాయె చేశావే చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది సమంత. ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. అటు తమిళంలోనూ పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది.
ఇక 2010 లో వచ్చిన ఏమాయె చేశావే చిత్రంతో అక్కినేని నాగ చైతన్యతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా వీరిద్దరూ కొన్నాళ్లపాటు ప్రేమించుకుని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 2017 అక్టోబర్ లో ఘనంగా జరిగింది. అయితే 2021 లో వ్యక్తిగత కారణాలతో ఈ దంపతులు విడిపోయారు. ఆ తర్వాత ఎవరి జీవితం వారు లీడ్ చేస్తున్న విషయం తెలిసిందే..
అలా నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత సినిమాలు చేయడం ఆపలేదు. వరుసగా సినిమాలు చేస్తూనే వచ్చింది. ఇక గతేడాది డిసెంబర్ లో బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకుంది. సమంత, రాజ్ నిడిమోరుల పరిచయం 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ద్వారా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ కు రాజ్, కృష్ణ డీకే కలిసి ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. అప్పటినుంచి వీరి మధ్య ఏర్పడిన అనుబంధం పెళ్లి వరకూ వెళ్లింది.

అయితే తాజాగా సమంత తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో బెడ్ రూమ్ లో రాజ్ నిడిమోరు పిల్లోతో ఉన్నాడు. ఆ ఫోటోను ఇన్ స్టా స్టేటస్ గా పెట్టుకుంది సమంత. బెడ్ రూమ్ లో రాజ్ నిడిమోరు నిద్రపోకుండా లాప్ టాప్ ముందు పెట్టుకుని సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నాడని అర్థం వచ్చేలా పిల్లో హోర్డర్ అని టెక్ట్స్ ఇచ్చింది సమంత. దాంతో సమంత బెడ్ రూమ్ ఫోటో ఒక్కసారిగా వైరల్ అయింది. ఈ పోస్టుపై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications