ఓటీటీలో దుమ్ము రేపుతున్న హీరామండి..!

నెట్ ఫ్లిక్స్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో హీరామండి వెబ్ సిరీస్ దుమ్ము రేపుతోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ తొలినాడే విశేషంగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. హిందీలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల ఆడియోల్లోనూ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.

సంజయ్ లీలా భన్సాలీ తొలి వెబ్ సీరీస్
అంతేకాదు మొత్తం తొమ్మిది విదేశీ భాషల్లో కూడా హీరామండి వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది .ఓటిటిలో సంజయ్ లీలా భన్సాలీకి చెందిన తొలి వెబ్ సిరీస్ హీరామండినే కావడం విశేషం. భారీ బడ్జెట్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా అత్యంత అద్భుతంగా ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు సంజయ్ లీలా భన్సాలి.

Sanjay leela bhansali Heera mandi creating sensation in Netflix

స్వాతంత్రోద్యమంలో హీరామండి వేశ్యల పాత్ర
భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముందు బ్రిటిష్ పాలనలో 1930,1940ల కాలం నాటి కథతో, అప్పుడు భారత స్వాతంత్రోద్యమంలో వేశ్యల పాత్ర ఏ విధంగా ఉండేది. హీరామండి అనే ప్రాంతాన్ని శాసించటం కోసం వేశ్యల మధ్య జరిగిన పోరాటం, ఆపై అది స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా కీరోల్ పోషించింది అన్నది చాలా అద్భుతంగా, ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు సంజయ్ లీలా భన్సాలి.

వెబ్ సీరీస్ లో నటులు అందరూ హేమాహేమీలే
ఈ వెబ్ సిరీస్లో మనీషా కొయిరాల, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, సంజీద షేక్, షార్మిన్ సెగల్ ప్రధానపాత్రలు పోషించారు. తాహా హా, జేషన్ షా, శేఖర్ సుమన్, ఫర్హీద్ ఖాన్, ఇంద్రేష్ మాలిక్ కూడా కీలకపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ కు మోయిన్ బేగ్ కథ అందించగా, సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ కు ఆయనే సంగీతాన్ని కూడా అందించారు. నిర్మాతగాను వ్యవహరించారు.

హీరామండిపై ఆధిపత్యం కోసం సంఘర్షణ, పోరాటంగా మారిన వైనం
హీరామండి ప్రాంతాన్ని శాసించే హుజూర్ స్థానాన్ని మల్లికా జాన్ (మనీషా కొయిరాల) సొంతం చేసుకుంటారు. అయితే ఆ స్థానం కోసం ఫరిదీన్ (సోనాక్షి సిన్హా) ప్రయత్నాలు చేస్తారు. వీరిద్దరి మధ్య జరిగిన ఆధిపత్య పోరు చివరకు భారత స్వాతంత్ర పోరాటానికి ఏ విధంగా దోహదం చేసింది. భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో వేశ్యల పాత్ర ఏమిటి అన్నది ఈ వెబ్ సిరీస్ లో ఆసక్తికరంగా తెరకెక్కించారు.

భారీ బడ్జెట్ వెబ్ సీరీస్
భారీ బడ్జెట్ తో రూపొందించిన సెట్లు, భారీ తారాగణం, అద్భుతమైన జ్యువెలరీ, కాస్ట్యూమ్స్, భారీ బడ్జెట్ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ కు సొగసులద్దాయి. ఈ వెబ్ సిరీస్ లో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎవరికి వారే స్ట్రాంగ్. మొత్తంగా ఈ వెబ్ సిరీస్ లో హీరామండిలో జరిగిన సంఘర్షణ చాలా అత్యద్భుతంగా చూపించారు.

మ్యాజిక్ చేసిన సంజయ్ లీలా భన్సాలీ
భారత స్వాతంత్ర పోరాటానికి హిరామండిలోని వేశ్యలు నవాబులకు అమ్ముడుపోయి ఆర్థిక వనరులను సమకూర్చారని, నాడు వేశ్యల పాత్ర కూడా చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ. మే 1వ తేదీన ఓటీడీలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ వెబ్ సిరీస్ తొలి రోజే దుమ్ము రేపింది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లుగా ఉన్న ఈ వెబ్ సిరీస్ లో ఏ ఎపిసోడ్ కు ఆ ఎపిసోడ్ ప్రత్యేకంగా నిలిచింది. తొలిరోజే మొదటి ఎపిసోడ్ నుంచి ఎనిమిదవ ఎపిసోడ్ వరకు కదలకుండా ప్రేక్షకులు చూశారంటే అది సంజయ్ లీలా భన్సాలీ మ్యాజిక్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+